/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-64-3.jpg)
Director Krishna Vamshi: టాలీవుడ్ లో అంత:పురం, మురారి, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ గత కొంతకాలంగా వెనకబడ్డాడు. ఇటీవల కాలంలో ఈయన నుంచి వచ్చిన 'రంగమార్తాండ' అనే సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. అయితే మహేష్ బాబుతో (Mahesh Babu) ఈయన చేసిన 'మురారి' మూవీ (Murari) ఆగస్టు 9 న రీ రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలో మహేశ్ బాబు అభిమానులతో ఎక్స్‌లో చిట్ చాట్ చేశాడు. కృష్ణవంశీ స్టార్ హీరో కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఆ హీరో ఎప్పుడు రెడీ అంటే ఆయనతో సినిమా చేస్తా అని తాజాగా వెల్లడించాడు. కృష్ణవంశీని చిట్ చాట్ సెషన్‌లో మీరు రాంచరణ్‌కు (Ram Charan) గుర్తుండిపోయే సినిమా ఇస్తామని ప్రామిస్ చేశారు. గుర్తుందా సార్ అని ఓ నెటిజన్ అడిగాడు.
Vundi saaar .. am ready .. whenever sir RAMCHARAN garu is ready I am all my self .. THQ 🙏♥️ super idea n script also ready .. his WISH n time sir ji ❤️🙏 https://t.co/aP4RgmmAKA
— Krishna Vamsi (@director_kv) July 17, 2024
దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. ఉంది.. రాంచరణ్ ఎప్పుడు రెడీ అంటే నేను కూడా రెడీనే. ధన్యవాదాలు.. సూపర్ ఐడియా, స్క్రిప్ట్ సిద్దంగా ఉంది. టైం నిర్ణయిస్తుంది సార్.. అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వీలైనంత త్వరగా పట్టాలెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రెజెంట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, RC16 మూవీస్ చేస్తున్నాడు. వీటి తర్వాత కృష్ణవంశీతో ప్రాజెక్ట్ పై ఏమైనా అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.
Also Read: నెట్ ఫ్లిక్స్ లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రేర్ ఫీట్!