Director Harish Shankar : కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన డెబ్యూ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఆగస్టు 15 న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ లో హీరో, హీరోయిన్ మధ్య ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ట్రోల్స్‌పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.." ఏజ్ గ్యాప్‌పై వస్తున్న వాదనలు నాకర్థం కావడం లేదు. ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నపుడు.. వాళ్లు చాలా విషయాలు చూస్తారు. కేవలం వయస్సు గ్యాప్ ఒక్కటే కాకుండా.. పెళ్లి కొడుకు కుటుంబ నేపథ్యం, జాతకంతోపాటు పలు విషయాలను ఆరా తీస్తారు. కానీ సినిమా విషయానికొస్తే.. మేం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. సినిమాలో 25 ఏండ్ల అమ్మాయిని కూడా 50 ఏండ్ల వ్యక్తి అని నమ్మించేలా చేయాల్సి వస్తుంది.
Also Read : తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!
ఇది నటన. అయితే స్క్రీన్‌పై వయస్సు అనేది కొంత ఉంటుంది. వయస్సు వ్యత్యాసంతో నటికి ఎలాంటి సమస్య ఉండదు. అందుకే ఆమె సినిమాకు సంతకం చేసింది. ఈ విషయంలో నటి సౌకర్యవంతంగా ఫీలనప్పటికీ.. మరి ఎందుకో కొంతమంది వయస్సు వ్యత్యాసం గురించి బాధపడుతుంటారని ప్రశ్నించాడు హరీష్ శంకర్. సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు భారీ బ్లాక్ బస్టర్లను అందించారు.
మరోవైపు రవితేజ, శ్రీలీల నటించిన ధమాకాను కూడా ఓ ఉదాహరణగా చెబుతూ.. ఒకవేళ ధమాకా ఫెయిల్యూర్ అయితే.. టీం చిన్న వయస్సున్న అమ్మాయిని తీసుకోవడం వల్లే జరిగిందని ట్రోలర్స్ చెబుతారు. వారంతా ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్నారు.. ఎందుకంటే భారీ హిట్ అయింది అంటూ ట్రోలర్స్ కు తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.