Ravi Teja : 'పవర్' కాంబో రిపీట్.. రవితేజతో బాబీ, ముచ్చటగా మూడోసారి..!

డైరెక్టర్ బాబీ బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నారట. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

New Update
Ravi Teja : 'పవర్' కాంబో రిపీట్.. రవితేజతో బాబీ, ముచ్చటగా మూడోసారి..!

Director Bobby To Team Up With Ravi Teja : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. హిట్టు,ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రెజెంట్ 'మిస్టర్ బచ్చన్' తో పాటూ 'RT 75' సినిమాలు చేస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రవితేజ 'పవర్' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన బాబీ.. సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వాల్తేరు వీరయ్య వంటి కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం బాలయ్యతో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. 'NBK109' పేరుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాబీ చేయబోయే నెక్ట్స్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నారట బాబీ.

Also Read : ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యంతో రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్..!

పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతున్నదని తెలుస్తున్నది. రవితేజతో బాబీ చేసిన పవర్‌, వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఈసారి వీరి కాంబోలో హ్యాట్రిక్ పక్కా అని అభిమానులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు