కరోనా వచ్చిన తరువాత ప్రముఖ టెకీ కంపెనీలన్ని కూడా తమ ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకుతున్నాయి. చిన్న చిన్న కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పని చేశాయంటే అనుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ పనిని చేస్తున్నాయి. ఇలా ఉద్యోగులను తొలగించడంలో గూగుల్ (Google) టాప్ లిస్ట్ లో ఉంది.
గూగుల్ ఈ ఏడాదిలో 12 వేల మందిని కంపెనీ నుంచి తొలగించింది.దీని గురించి సుందర్ పిచాయ్ (Sundarpichay) ఇటీవల ఓ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. తమ కంపెనీ తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ చెప్పుకొచ్చారు. ఆర్థికంగా టాప్ పొజిషన్‌లో ఉండడంతో పాటు..కంపెనీ పొజిషన్ ని మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.
అయితే ఉద్యోగం నుంచి తొలగించిన తరువాత చాలా మంది కంపెనీ ఉద్యోగులు సోషల్ మీడియాలో (Social media) తమ ఆవేదనను తెలియజేస్తూ పోస్ట్ లు పెట్టారు. ఇది తమ జీవితంలో చాలా కష్టమైన ఫేజ్ అని పేర్కొన్నారు. దీని గురించి సుందర్ పిచాయ్ స్పందించారు. కంపెనీకి వేరే అవకాశం లేక ఇలా చేయాల్సి వచ్చిందే కానీ..మాకు ఎవరి మీద కోపం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఈ సమయంలో మేము ఆ కఠిన నిర్ణయాన్ని కానీ తీసుకుని ఉండకపోతే..కంపెనీ చాలా నష్టపోయేదని తెలియజేశారు. అయితే లే ఆఫ్ ల విషయంలో మా కంపెనీ కూడా కొన్ని పొరపాట్లు చేసింది. దానిని నేను అంగీకరిస్తున్నాను. అది కాస్త పద్దతిగా జరిగి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు.
లే ఆఫ్ లు జరిగిన తరువాత ఆ ప్రభావం కంపెనీ మీద కచ్చితంగా ఉంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని వివరించారు. ఏ సంస్థకైనా ఇలాంటివి ఎదుర్కోవడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందని తెలిపారు. గడిచిన 25 సంవత్సరాల్లో గూగుల్ ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొలేదని తెలియజేశారు.
కంపెనీ కానీ లే ఆఫ్ ల విషయం లో ఏ మాత్రం ఆలస్యం చేసిన కంపెనీకి భారీ నష్టం కలిగేదని వివరించారు. ఏడాది కాలం నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాం. వాటిని అన్నిటిని అధిగమించడానికి కంపెనీ ప్రయత్నిస్తుందని వివరించారు.
Also read: రవితేజ పక్కన ఆ హీరోయిన్ కాదు..ఈమె నటిస్తోంది!