/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tdp-1-2-jpg.webp)
Kadapa : అన్నమయ్య జిల్లా(Annamayya District) రాజంపేట టీడీపీ(TDP) లో అసమ్మతి చల్లారడం లేదు. మాజీ ZPTC సుగవాసి బాలసుబ్రమణ్యంకు టికెట్ ఇవ్వడంతో రాజంపేట(Rajampet) టీడీపీ ఇంఛార్జ్ బత్యాల చెంగల్రాముడు(Bathyala Changal Rayudu) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు నేటి నుంచి అసమ్మతి నేత బత్యాల ఇంటింటి ప్రచారం చేపట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. నందలూరు మండలం పొత్తపిలోని మూలస్థానేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇలా రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగలు చల్లబడకపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.
 Follow Us
 Follow Us