Women Health: స్త్రీలు ఈ నాలుగు ఆహారాలు తింటే 40ల్లోనూ 20లాగా కనిపించవచ్చు!

వయసులో ప్రతి దశలో స్త్రీల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. 40 సంవత్సరాల తర్వాత మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గుల ద్వారా ముఖంలో వయసు పెరిగినట్టు కనిపిస్తుంది. ఆహారంలో ఉసిరి, అశోక, ఆస్పరాగస్, మోరింగా లాంటి చేర్చుకుంటే నిత్యం యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Women Health: స్త్రీలు ఈ నాలుగు ఆహారాలు తింటే 40ల్లోనూ 20లాగా కనిపించవచ్చు!

Women Diet: వయసు పెరిగే కొద్దీ ఆహారం, జీవన విధానంలో మార్పులు చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి . 40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో చాలా హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖం మీద వయసు పెరగడం, శరీరం క్రమంగా బలహీనపడటం మొదలైతుంది. ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలనుకుంటే,వృద్ధాప్యాన్ని నివారించాలనుకుంటే, రోజూ తినే ఆహారంలో ఈ నాలుగు పదార్థాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో తెలుసుకుందాం.

యవ్వనం కోసం  తినే ఆహార పదార్థాలు

ఉసిరి: మహిళల ఆరోగ్యానికి ఉసిరికాయ చాలా మంచిది. ఉసిరిని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఉసిరికాయ తినడం వల్ల వృద్ధాప్యం , చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఉసిరి వృద్ధాప్యాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

అశోక: అశోక ఒక ఆయుర్వేద టానిక్‌ అని కూడా అంటారు. అశోక స్త్రీలకు ఆరోగ్యానికి మంచిది. 40 ఏళ్ల తర్వాత ఋతు చక్రం సరిగ్గా లేకుంటే అశోక ఎంతో మేలు చేస్తుంది.

ఆస్పరాగస్: 40 ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి. ఇది మహిళలకు అద్భుత మూలికలా పనిచేస్తుంది. ఆస్పరాగస్ మహిళల హార్మోన్లను సమతుల్యం చేసి మనసు, శరీరం చాలా రిలాక్స్‌గా ఉంటాయి. పీరియడ్స్, ఫెర్టిలిటీ, మెనోపాజ్ టైంలో ఆస్పరాగస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మోరింగా: మోరింగ్‌ మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉండే ఖనిజాలు మోరింగ్‌ ఒకటి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎలిమెంట్స్ వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: శరీరంలో ఈ మార్పులు అకస్మాత్తుగా కనిపిస్తే అది ప్రాణాంతకమే.. జాగ్రత్త!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చలికాలంలో ఈ స్వీట్‌ను టేస్ట్ చేయాల్సిందే.. బెల్లం, ఖర్జూరంతో రసమలైని ఇలా తయారు చేసి చూడండి!

Advertisment
తాజా కథనాలు