MLA ticket: ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కినట్లేనా..

ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్‌ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు.

New Update
MLA ticket: ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కినట్లేనా..

జనగామ టికెట్‌ మళ్లీ ఆయనకే వస్తుందా.. ఇటీవల సొంత పార్టీపై ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడెందుకు మాట మార్చారు. తనకు సీటు ఖాయమైందని ఎమ్మెల్యే ధీమాగా వున్నారా.. తన భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఆ ఎమ్మెల్యే తనకే టికెట్‌ వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారా..? తాను సీఎం పిలిస్తేనే కాంగ్రెస్‌ నుంచి వచ్చానన్నా ఆయన.. తన క్యాడర్‌ మొత్తం కాంగ్రెసే అని గతంలో చెప్పిన ఎమ్మెల్యేకు అధిష్టానం టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించుకుందా.? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు.. ఏంటా నమ్మకం.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా స్పందించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల వల్ల జిల్లాలోని బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గ విభేదాలు జరుగుతున్నాయని, వారు పార్టీని నాశనం చేయాలని అనేక రూపాల్లో కుట్రలు పన్నారన్న ఆయన.. మంత్రి కేటీఆర్‌ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన వారిని కట్టడి చేశారన్నారు. నియోజకవర్గంలో ఎవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

పార్టీ ఎవరినీ తప్పుబట్టదన్న ముత్తిరెడ్డి.. సొంత పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. జనగామా నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా మూడో సారి తానే పోటీ చేయబోతున్నట్లు, ఎన్నికల్లో గెలవబోతున్నట్లు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తేల్చి చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ బెంగపెట్టుకోవద్దని, పార్టీ అధిష్టానం అందరినీ ఆదరిస్తుందన్నారు. అందరం కలిసి పార్టీ కోసం పని చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా ఇప్పటి వరకు తనను ఇబ్బంది పెట్టిన నాయకులు ఇకపై తనను ఇబ్బంది పెట్టకుండా పార్టీ కోసం పని చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

కాగా సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యే టికెట్ల లిస్ట్‌ను ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తాను సీఎం కేసీఆర్‌ పిలిస్తేనే బీఆర్ఎస్‌లోకి వచ్చానని, ప్రస్తుతం నియోజకవర్గంలో తనకంటే బలమైన నాయకులు ఎవరూ లేరని, తన క్యాడర్‌ మొత్తం కాంగ్రెస్‌కు చెందిందేనని, తనకు టికెట్‌ ఇవ్వకపోతే తాను కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తానని మొత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు