Health Benefits: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..?

పండుగ సీజన్‌లో రకరకాల ఫుడ్‌ ఐటమ్‌ ఉంటాయి. కానీ డయాబెటిస్ పేషెంట్లకు చక్కెరతో తయారు చేసిన పాలు, పెరుగు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ పెరుగుతాయి. అయితే వీళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం తినవచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి మీ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.

New Update
Health Benefits: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..?

Diabetes patients: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య డయాబెటిస్. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎక్కువగా ఉండడాన్ని డయాబెటిస్ సమస్య అంటారు. ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం మధుమేహం జన్యు పరంగా వస్తుంది. రెండో రకం అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చే ముందు ఉండే స్థితిని ప్రీ డయాబెటిస్ అని కూడా అంటారు. జస్టిషనల్ డయాబెటిస్ గర్భం దాల్చిన మహిళల్లో కొంతకాలం వరకు ఈ వ్యాధి ఉంటుంది. కానీ టైప్-2 డయాబెటిస్‌ అత్యంత ముఖ్యమైనవిగా డాక్టర్లు చెబుతున్నారు.

డయాబెటిస్‌ సమస్యను అదుపు చేయవచ్చు

ఈ డయాబెటిస్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే స్థూలకాయంతోపాటు గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారి తీస్తాయని చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు వల్ల ఈ డయాబెటిస్‌ సమస్యను అదుపు చేయవచ్చు అంటున్నారు. ఇక డయాబెటిస్ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చా అని చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. అయితే.. ఈ డయాబెటిస్ సమస్య ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవచ్చ. కాకపోతే కొవ్వు లేని వాటిని తీసుకోవాలని ఆరోగ్య వైద్యులు చెబుతున్నారు. వెన్నతీయబడిన పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా.. తయారుచేసిన పెరుగు మాత్రమే తిసుకుంటే శరీరంలో కొవ్వు రాకుండా ఉంటుందన్నారు.

ఇది కూడా చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఇవే.. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు

పాలు, పెరుగులో ఉండే పోషకాలు, ప్రోటీన్లు డయాబెటిస్ ఉన్నవారికి చాలా మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. వెన్న తీసిన పాలను రోజుకు ఓ రెండు గ్లాసులు తాగినా ఆరోగ్యానికి మంచిది. అదే పెరుగు అయితే రెండు కప్పుల వరకు తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకుంటే హెల్త్‌కి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఇక మజ్జిగ రూపంలో అయితే మూడు నుంచి నాలుగు గ్లాసులు తాగవచ్చని అంటున్నారు. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు జంక్‌ఫుడ్, చెక్కర ఉండే పదార్థాలు, శీతల పానీయాలకు చాలా దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారాలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు కొవ్వు, పిండి పదార్థాలను తగ్గిస్తే ఇంకా మంచిది. దీంతో డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు అంటున్నారు. మన రక్తంలోని చక్కర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు