Dhruv: మరో ధోనీ.. ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ పై ప్రముఖుల ప్రశంసలు!

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ధ్రువ్ మరో ఎమ్ఎస్ ధోనీ అంటూ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు.

New Update
Dhruv: మరో ధోనీ.. ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ పై ప్రముఖుల ప్రశంసలు!

Dhruv Jurel - Another MS Dhoni: టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ఇంగ్లాండ్ తో (India Vs England) జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో పీకల్లోతూ కష్టాల్లో ఉన్న భారత ఇన్నింగ్స్ ను బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ క్రమంలో 149 బంతుల్లో 4సిక్స్ లు, 6 ఫోర్ల సాయంతో 90 ప‌రుగులు చేసిన ధ్రువ్.. సెంచ‌రీ మిస్ చేసుకున్నప్పటికీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఆల్‌రౌండర్ టాలెంట్ పై సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసల వర్షం కురిపించారు. ధృవ్ జురెల్ (Dhruv Jurel) మరో ఎంఎస్ ధోనీ అంటూ పొగిడేస్తున్నారు.

ఒక్కో ప‌రుగూ పేర్చుకుంటూ..
ఈ మేరకు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 353 ప‌రుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ అదిలోనే టాప్ ఆర్డర్ వికేట్లు కోల్పోయింది. యశస్వీ కాసేపు పోరాడిన భారీ ఇన్నింగ్స్ నిర్మించలేకపోడు. ఇక ఒక ద‌శ‌లో 177 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి భారత్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అశ్విన్‌, జ‌డేజా కూడా వెనుదిర‌గ‌డంతో ఇండియా 200లోపే ఆలౌట‌వ‌డం ఖాయంగా అనిపించింది. కానీ యువ వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురెల్ స‌హ‌నంతో ఆడాడు. కుల్‌దీప్ యాద‌వ్‌తో క‌లిసి ఒక్కో ప‌రుగూ పేర్చుకుంటూ జ‌ట్టు స్కోరును 300 దాకా లాక్కెళ్లాడు. చక్కటి స్ట్రోకుల‌తోనూ అల‌రించిన జువ్ 90 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగాడు. ఇండియా 307 ప‌రుగుల‌కు భార‌త్ ఆలౌట‌యింది. అయితే ధ్రువ్ ఆట తీరుపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Guinness World Record: అగ్గిపెట్టె సైజులో వాషింగ్ మెషీన్.. ఆంధ్ర కుర్రాడు గిన్నిస్‌ రికార్డు!

ఇక రాజ్‌కోట్ టెస్టులో అరంగేట్రం చేసి 46 పరుగుల చేసిన ధ్రువ్.. ఈ ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. అప్పుడు కూడా జురెల్ 8వ వికెట్‌కు ఆర్‌ అశ్విన్‌తో కలిసి 77 పరుగులు జోడించారు. ఇక రాంచీలో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. యాభై పూర్తి చేసి భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 120 పరుగులకు 5 వికెట్లు కొల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, కుల్డీప్ 2 వికెట్లు పడగొట్టారు.

Watch NZ vs AUS 2nd T20I - Cricket Highlights:

Advertisment
Advertisment
తాజా కథనాలు