IPL 2024 : ఈ మ్యాచ్ ఏ ధోని తో ఆడే చివరిది అనుకుంటా..విరాట్ కోహ్లీ!

ఐపీఎల్ 2024లో కీలక మ్యాచ్‌లోRCB,CSK జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్‌తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ధోని రిటైర్ మెంట్ పై విరాట్ కోహ్లీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అవేంటో ఇప్పుడు చూద్దాం..

IPL 2024 : ఈ మ్యాచ్ ఏ ధోని తో ఆడే చివరిది అనుకుంటా..విరాట్ కోహ్లీ!
New Update

Dhoni : ఐపీఎల్ 2024 (IPL 2024) లో కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ సిరీస్‌తో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడైంది.అయితే ఈ టోర్నీ క్రికెట్ దిగ్గజాలు ధోనీ, విరాట్ కోహ్లీల మధ్య చివరి మ్యాచ్ గా జరగనుంది.

దీనిపై విరాట్ కోహ్లీ (Virat Kohli) బహిరంగంగానే మాట్లాడాడు.దీనిపై విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. 'ధోనీ, నేను కలిసి ఆడే చివరి మ్యాచ్ ఇదే కావచ్చు. ఈ బిగ్ మ్యాచ్‌లో ధోనీని చూడటం అభిమానులకు గొప్ప సంతోషాన్నిస్తుంది. మేమిద్దరం కలిసి భారత జట్టు కోసం చాలా మ్యాచ్ లు ఆడాం..వాటిలో ఇద్దరం కలసి భాగస్వాములుగా పరుగులు చేశాం. చాలా సార్లు ధోనీ చివరి వరకు నిలబడి చాలా మ్యాచ్‌లు గెలిపించాడు.కానీ ఇప్పటికీ అతని స్థానాన్నిఎవరు భర్తీ చేయలేకపోయారని విరాట్ కొనియాడాడు.

విరాట్ కోహ్లీ ధోనీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడని ధోనీ అభిమానులు ఉర్రూతలూగిస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాలంటే ఈ మ్యాచ్‌లో CSK తప్పక గెలవాలి. అప్పుడే CSK ప్లే ఆఫ్ రౌండ్‌లోని మొదటి మ్యాచ్‌లో విజయం సాధించి, ఆపై చెపాక్‌లో జరిగే రెండో క్వాలిఫయర్ లేదా ఫైనల్‌లో పాల్గొనగలదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ మ్యాచ్ లైఫ్ అండ్ డెత్ మ్యాచ్.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నెట్ రన్ రేట్‌ను అధిగమించాల్సిన పరిస్థితి ఆ జట్టుకు ఉంది. ఈ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ పూర్తవుతుందా? తగ్గిన ఓవర్లతో మ్యాచ్ ఆడితే బెంగళూరు జట్టు ఏం చేయాలనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయని ఆ జట్టు అభిమానులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇరు జట్ల అభిమానులకు ఈ మ్యాచ్ కీలకం.

Also Read : వర్షం పడిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ లోకి.. అది ఎలానే చూసేయండి..

#dhoni #virat-kohli #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe