పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్‌-4 అభ్యర్థుల ధర్నా

ఇందిరా పార్కు వద్ద ఏఈఈ, గ్రూప్‌-4 అభ్యర్థుల ధర్నా చేపట్టారు.  ఏఈఈ, గ్రూప్‌-4, జేఎల్‌, పీఎల్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హారిజంటల్‌ రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించి, కోర్టు వివాదాలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.

New Update
పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్‌-4 అభ్యర్థుల ధర్నా

హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ మళ్లీ కలకలలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ ను ఎత్తేసిన విషయం తెలసిందే. కాగా ఇటీవలే తెలంగాణలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధర్నా చౌక్ ను పున ప్రారంభించింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యానికి నిరసన చేపడుతూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు దిగి ధర్నా చౌక్ కు పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆ మరుసటి రోజునుంచే అక్కడ ధర్నాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారంతా మళ్లీ పెద్ద ఎత్తున్న నిరనసనలు, నిరాహార ధీక్షలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఇందిరా పార్కు వద్ద ఏఈఈ, గ్రూప్‌-4, జేఎల్‌, పీఎల్‌ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఈఈ, గ్రూప్‌-4 అభ్యర్థుల ధర్నా చేపట్టారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల యువతకు తీరని అన్యాయం జరిగింది. ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్స్ వేసి పెద్ద ఎత్తున్న అభ్యర్థుల నుంచి డబ్బులు వసూల్ చేసి కేసీఆర్ ప్రభుత్వం మోసి చేసింది. గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించిన ఇప్పటి వరకూ ఫలితాలు వెలువడలేదు. గ్రూప్ 2, 3 పరీక్షలకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదంటూ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే హారిజంటల్‌ రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించాలని కోరిన అభ్యర్థులు.. కోర్టు వివాదాలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి : నడవలేనిస్థితిలో ఇంటి పెద్ద.. కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన కుల పెద్దలు

ఈ క్రమంలోనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. జీవో నంబరు 46 కారణంగా తాము నష్టపోయామంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద శనివారం నిరసన దీక్ష చేశారు. జీవో నంబరు 46పై గత ప్రభుత్వంలోని హోం మంత్రికి అవగాహన లేకపోవడం, బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేక మంది అభ్యర్థులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ జీవోను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. జీవో నంబరు 46 వల్ల తెలంగాణలోని యువకులు స్థానికేతరులుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఓయూ జేఏసీ ఛైర్మన్‌ రాజు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు