ధరణి పేదల కోసం కాదు..పెద్దల కోసం: ఈటల రాజేందర్

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం కాదు.. పెద్దల కోసమే ధరణి తీసుకొచ్చిండు ఈటల అన్నారు. భూములు అమ్మవద్దన్న ప్రభుత్వం ఈ రోజు భూములు ఎలా అమ్ముతున్నారని ఈటల ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారని.. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ధరణి పేదల కోసం కాదు..పెద్దల కోసం: ఈటల రాజేందర్
New Update

కలెక్టర్లు టార్గెట్

ధరణి పేదల కోసం కాదు..పెద్దల కోసమని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్లు పెట్టారని.. చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు 3 రోజులు.. ఈ ఏడాది మొత్తం 14 రోజులు మాత్రమే జరిగాయని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు సమావేశాలు జరిగేవని..ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళుగా.. పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్ళుగా మార్చారని అన్నారు. అసెంబ్లీలో నేడు 4 పార్టీలే ఉన్నాయి..ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి.. అన్ని పార్టీలతో BAC సమావేశం నిర్వహించేవారని గుర్తు చేశారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి BAC సమావేశానికి పిలువలేదని అన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జయప్రకాష్ నారాయణను కూడా BAC సమావేశంలో పాల్గొనేవారని అన్నారు. బీజేపీ సభ్యులకు అసెంబ్లీలో ఒక్క రూం కేటాయించాలని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు.

సహాయం కూడా చేయలేదు

సభ సజావుగా సాగిందని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఈటల అన్నారు. స్పీకర్ మావైపు కన్నెత్తి కూడా చూడక పోవటం బాధకారమన్నారు. ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ MIM పొగడటం జుగుప్సాకరంగా ఉందన్నారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం, చట్ట సభల మీద BRS నేతలకు నమ్మకం లేదన్నఈటల ఈ సభతో BRSకి బైబై చెప్పినట్లే అని వ్యాఖ్యానించారు. వరదలతో 41 మంది కొట్టుకుపోయారు.. అసెంబ్లీలో కనీసం సంతాపం చెప్పలేదు.. దీనిని బట్టి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వరదలతో చాలా మంది నష్టపోయారని.. కనీసం సహాయం కూడా ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. 109 సీట్లు వస్తాయని అహంకారంతో సీఎం కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. మూడు రోజులు సభ జరిగితే, ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు.

వెల కోట్ల వడ్డీ పెరిగింది

ఈ సందర్భంగా కాగ్ రిపోర్ట్‌పై ఈటల సంచలన కామెంట్స్ చేశారు. బడ్జెట్ పెరుగుతుంది... కేటాయింపులు తగ్గుతున్నాయి అన్నారు ఈటల. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదన్నారు. దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉంది ప్రభుత్వ తీరు ఉందని ఈటల అన్నారు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14 వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వ ఖర్చులలో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుందని.. నాలుగు కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకే పోతుందన్నారు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం.. కానీ ఈ రోజు భూములు ఎలా అమ్ముతున్నారని ఈటల ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికి ఎకరా వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చేస్తున్నారని.. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.

#etala-rajender #cm-kcr #etala-comments-on-cag-report #dharani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe