Dhanush : 'కుబేర' కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో!

ముంబై లోని అతి పెద్ద డంపింగ్ యాడ్ లో 'కుబేర' షూటింగ్ చేయాలనీ మూవీ టీమ్ నిర్ణయించగా.. అందులోని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ ఆ డంపింగ్ యాడ్ లో మాస్క్ లేకుండా సుమారు 10 గంటల పాటూ నటించారట.

New Update
Dhanush : 'కుబేర' కోసం ధనుష్ సాహసం.. మాస్క్ లేకుండా 10 గంటల పాటూ డంపింగ్ యాడ్ లోనే ఉన్న హీరో!

Dhanush Dedication For Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి సినిమాలపై ఎంతటి డెడికేషన్ తో ఉంటారో తాజాగా మరో సంఘటనతో వెల్లడైంది. ధనుష్ ఓ పాత్ర చేస్తున్నాడంటే అది సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా తన కొత్త సినిమా కోసం ధనుష్ చేసిన సాహసం ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ అంతటా చర్చనీయాంశంగా మారింది.

10 గంటల పాటూ డంపింగ్ యాడ్లో ఉన్న ధనుష్

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతోంది. ఇందులో ధనుష్ స్లమ్ లో నివసించే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుండగా.. షూటింగ్ లో భాగంగా ధనుష్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read : మరో వివాదంలో బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై కేస్ పెట్టిన మహిళ?

ముంబై లోని అతి పెద్ద డంపింగ్ యాడ్ లో షూటింగ్ చేయాలనీ మూవీ టీమ్ నిర్ణయించగా.. అందులోని సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ ఆ డంపింగ్ యాడ్ లో మాస్క్ లేకుండా సుమారు 10 గంటల పాటూ నటించారట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్, నెటిజన్స్ సినిమాలపై ఆయనకున్న డెడికేషన్ ని మెచ్చుకుంటూ, ధనుష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

Advertisment
తాజా కథనాలు