TELANGANA -  GHMC: జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా

జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా.ప్రజల సౌకర్యార్థం జిహెచ్‌ఎంసి పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి,మెరుగుపరచడానికి సమర్థవంతమైన చర్యలపై పోలీస్ అధికారుల సూచనలు డిజిపి కోరారు.

New Update
TELANGANA -  GHMC: జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ రవి గుప్తా
TELANGANA -  GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవిగుప్తా  (DGP RAVI GUPTA )మంగళవారం నాడు సీనియర్ పోలీస్  అధికారులతో సమీక్ష సమావేశం  నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఐజీ తరుణ్ జోషి తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ
ఈ సమావేశంలో ప్రజల సౌకర్యార్థం జిహెచ్‌ఎంసి పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి మరియు మెరుగుపరచడానికి సమర్థవంతమైన చర్యలపై పోలీస్ అధికారుల సూచనలు డిజిపి కోరారు. విజిబుల్ పోలీసింగ్‌ను అమలు చేయడం మరియు ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ అందించడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త స్కైవాక్‌లు, ఫ్లైఓవర్‌ల చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను డీజీపీకి వివరించారు. మూసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేసిన డీజీపీ, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అందించిన సిఫారసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను డిజిపి రవిగుప్తా  ఆదేశించారు.
ర్యాష్ డ్రైవింగ్ తో  హల్చల్
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి. అయితే.. ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని ఉన్నా సరే .. కొంతమంది ర్యాష్ డ్రైవింగ్ తో  హల్చల్ చేస్తూండటం  వలన కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. మరో వైపు పాదచారులకు కంఫర్ట్ వాకింగ్ పాత్ లు సైతం  ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమయినా ట్రాఫిక్ సిస్టం మెరుగుపడాలంటే  సమీక్షా సమేవేశాలు తప్పని సరి.
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా  సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తా నియమితులయి 42 రోజులు కావస్తోంది.. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో  ఎన్నిక కోడ్ ను అతిక్రమించి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన అప్పటి  తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అంజనీ కుమార్‌ స్థానంలో  తెలంగాణా కొత్త డిజిపిగా రవిగుప్తా నియమియతులయ్యారు.
Advertisment
తాజా కథనాలు