AP: ఏపీలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు, అట్రాసిటీ కేసులు.. యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ విడుదల!

ఏపీ 2023 నేర చరిత్రకు సంబంధించిన జాబితాను గుంటూరు  డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే నేరాల శాతం తగ్గిందని, హత్యలు, లైంగిక వేధింపులు చాలా తగ్గిపోయాయని చెప్పారు. ఈ ఏడాది పోలీసు శాఖ మరింత సమర్థవతంగా పనిచేసిందని పేర్కొన్నారు.

AP: ఏపీలో భారీగా తగ్గిన సైబర్ నేరాలు, అట్రాసిటీ కేసులు.. యాన్యువల్ క్రైమ్ రిపోర్ట్ విడుదల!
New Update

AP Crime Report: ఆంధ్రప్రదేశ్ వార్షిక నేర చరిత్రకు సంబంధించిన జాబితాను గుంటూరు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) గురువారం విడుదల చేశారు. గురువారం మంగళగిరి (Mangalagiri)  డీజీపీ కార్యాలయంలో ఇయర్‌ ఎండింగ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన ఆయన 2023 నమోదైన క్రైమ్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నేరాల శాతం తగ్గిందని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు కూడా తగ్గినట్లు తెలిపారు.

ఈ ఏడాది పోలీసు శాఖ మరింత సమర్థవతంగా పనిచేసింది. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోమ్ గార్డుల వరకూ తమ కర్తవ్యాన్ని సమర్థవతంగా నిర్వర్తించారు. క్రైం రేటు అన్ని అంశాల్లో తగ్గుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది హత్యలు చాలా తగ్గిపోయాయి. ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి పలు నేరాలకు పాల్పడే గ్యాంగులను పట్టుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.

బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ హైవే లు, స్టేట్ హైవే లపై ప్రమాదాలను తగ్గించాం. టూ వీలర్ దొంగతనాలు పట్టుకున్నాం. 7.83 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించాం. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గిపోయాయి. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు లైఫ్ ఇంప్రెసన్ మెంట్ పడిన కేసులు 57, 20ఏళ్లు శిక్ష పడిన కేసులు 49, పదేళ్లు శిక్ష పడిన కేసులు 41, ఏడేళ్లు శిక్ష పడినవి 15 కేసులున్నాయి వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Nagababu Vs RGV: ఆర్జీవీని పెగ్గేసి పడుకోమన్న నాగబాబు.. అన్నదమ్ములు అడుక్కు తింటున్నారంటూ వర్మ కౌంటర్

అలాగే వరకట్నం, పొక్సో కేసులు తక్కువగా నమోదయ్యాయని, ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతమే రికార్డుల అయినట్లు తెలిపారు. సైబర్ నేరాలు గణనీయంగా 25శాతం పడిపోయాయని, దీనికి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చిందన్నారు. ఎక్కువ సైబర్ నేరాలకు పాల్పడిన వారు రాజీకి వచ్చి క్షమాపణలు చెబున్నారు. బ్యాంకుల సమన్వయంతో సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నాం. యంగ్ ఆఫీసర్లకు సైబర్ నేరాల అరికట్టేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం. లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారమయ్యాయి. రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. మొత్తం 4 వేల మందిలో 1000 మంది జైల్లో ఉన్నారు.

ఈ ఏడాదిలోనే 900 మంది రౌడీషీటర్లు కన్విక్ట్ అయ్యారు. 200 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేసాం. 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసాం. గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల ఎకరాలను ట్రైబల్స్ కు అందించింది. గంజాయి పెడలర్స్, స్మగ్లర్, కన్జ్యుమర్స్ ఎవరినీ వదిలి పెట్టట్లేదు. ఈ మూడేళ్లలో 5లక్షల కేజిల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేమన్న ఆయన.. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘాపెట్టామని, ఈ మధ్య కాలంలో వారి కార్యకలాపాలు, కదలికలు లేవని స్పష్టం చేశారు.

#andhra-pradesh #dgp-rajendranath-reddy #ap-crime-report
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe