Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు

శబరిమలలో ఈరోజు(సోమవారం) మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప నామస్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి దర్శనమిచ్చే మకర జ్యోతిని వీక్షేంచేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.

Makara Jyothi: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం.. పోటెత్తిన అయ్యప్ప స్వామి భక్తులు
New Update

కేరళలోని శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములు అక్కడికి భారీగా తరలివస్తున్నారు. స్వామి శరణం.. అయ్యప్ప శరణంం నామ స్మరణలతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. మకరజ్యోతిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు 50 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని ట్రావెన్‌కోర్ బోర్టు ప్రకటించింది. కానీ వాస్తవానికి 4 నుంచి 5 లక్షల మంది వరకు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.

Also read: స్టాఫ్‌నర్సుల భర్తీ ప్రక్రియ తుదిదశకు.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు..

శివుని తనయుడు అయ్యప్ప స్వామి కొలువుదీరిన క్షేత్రం శబరిమల. శబరిలో ప్రతి మకర సంక్రాంతి రోజున.. శబరిలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వామలు శబరికి వెళ్తుంటారు. మకర జ్యోతిని దర్శించుకున్నాకే తమ వీక్షను విరమిస్తారు. 41 రోజుల పాటు దీక్ష చేసిన స్వాములు మకర జ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఈ జ్యోతి దర్శనం ఉంటుందని.. ఆలయ బోర్టు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది.

Also Read: రామ భక్తులకు గుడ్ న్యూస్…ఈ దక్షిణాది నగరాల నుంచి అయోధ్యకు విమానాలు..!!

#shabarimala #makarasankranthi #ayyappa-devotees
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి