Leopard Again in Tirumala Ghat : తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపింది. తిరుపతి(Tirupati) నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తులు కారులో ఘాట్ రోడ్డు(Ghat Road) లో వెళ్తుండగా...చిరుత రోడ్డుకి అడ్డుగా వచ్చింది. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు కారు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది.
గతంలో అలిపిరి(Alipiri) నడకమార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతులు కనిపించాయి.. ఈసారి ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుత తిరుమల ఘాట్ రోడ్డులో ప్రత్యక్షం కావడం భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది.
Also read: పెంపుడు కుక్క పై పొరుగింటి వారి పైశాచికత్వం!