Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?

'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

Devara Movie : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?
New Update

Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సెప్టెంబర్ 10 న ట్రైలర్ కూడా రాబోతుంది. ఈ ట్రైలర్ ను ముంబై లో లాంచ్ చేస్తున్నారు.

అక్కడే మీడియా మీట్ కూడా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ తో పాటూ మూవీ టీమ్ సైతం ఇందులో పాల్గొననుంది. 'దేవర' ప్రమోషన్స్ ను బాలీవుడ్ లో స్టార్ట్ చేసి టాలీవుడ్ లో ఎండ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన రష్మిక.. వైరల్ అవుతున్న పోస్ట్

ఇక ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివ తో ,మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. గతంలో మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' ఫంక్షన్ కు తారక్ గెస్ట్ గా వచ్చాడు. ఈసారి 'దేవర' కోసం మహేష్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

#jr-ntr #mahesh-babu #devara-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe