ఈ రోజు తెలంగాణలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 8: 45 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దాదాపు 50 నిమిషాలపాటు శ్రీవారి ఆలయ పరిసరాల్లో గడిపారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి మోదీ బయల్దేరారు.

New Update
ఈ రోజు తెలంగాణలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే

Modi Telangana Tour: భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర బలగాలతో పాటు తెలంగాణ, ఏపీ పోలీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నరేంద్రమోదీ తెలంగాణలో పలు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన పూర్తి షెడ్యూల్ ఇలా ఫైనల్ చేశారు అధికారులు.

Also read : అది తెలివి తక్కువతనమే.. ఫైనల్లో భారత్ ఓటమిపై అంబటి రాయుడు

ప్రధాని మోదీ పర్యటన వివరాలు:
తిరుమల దర్శనం అనంతరం తెలంగాణలోని ఎన్నికల ప్రచారానికి బయల్దేరనున్న మోదీ.. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తెలంగాణలోని హకీంపేటకు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. ఆ తర్వాత 12:45కు మహాబూబబాద్ సలక జనుల విజయ సంకల్ప సభలో పాల్గొని 40 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. అక్కడినుంచి బయలదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు కరీంనగర్ లోని సంకల్ప సభలో పాల్గొంటారు.
మళ్లీ సాయంత్రం 4 గంటల తర్వాత హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల మేరకు రోడ్ షోలో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత అమీర్ పేట్ లోని గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ.. 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనననున్నారు. చివరగా 7:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి బెంగళూర్ వెళ్లడంతో ఈరోజు ప్రధాని తెలంగాణ పర్యటన ముగుస్తుంది.

Advertisment
తాజా కథనాలు