Bhatti Love Story:ఎల్లలు దాటిన ప్రేమ..పెద్దలు మెచ్చిన వివాహం..భట్టి లవ్‌ స్టోరీ

ప్రపంచంలో ప్రతి గుండె వెనకా ఒక ప్రేమ కథ దాగి ఉంటుంది. సామాన్యుల నుంచి దేశాలని ఏలే ప్రధానులు, ప్రెసిడెంట్‌ల వరకూ అందరూ ప్రేమ సముద్రంలో ఎప్పుడో ఒకసారి మునిగినవాళ్లే. అలాంటి వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.

New Update
Bhatti Love Story:ఎల్లలు దాటిన ప్రేమ..పెద్దలు మెచ్చిన వివాహం..భట్టి లవ్‌ స్టోరీ

Deputy CM Batti Vikaramarka:చాలా సీరియస్‌గా ఉంటూ, ఎంతో మృదువుగా మాట్లాడే నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ప్రత్యర్ధులపై తిట్లవర్షం కురిపించడమే పాలిటిక్స్ అనుకునే నేటి తరం రాజకీయ నాయకుల్లో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా అనిపించేలా ఉంటుంది ఆయన తీరు. అంతటి నెమ్మదైన నాయకుడి జీవితంలోనూ ఓ ప్రేమకథ ఉంది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నారు భట్టి విక్రమార్క.

తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం...ఇద్దరూ ప్రేమ పక్షులే...

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కది కూడా ప్రేమ వివాహం కావడం ఆసక్తికరమైన విషయం. డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న భట్టి... సొంత ఊరు ఖమ్మం జిల్లా, వైరా మండలం, లక్ష్మీపురం. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అన్నదమ్ముల్లో ఆఖరివాడు మల్లు భట్టి విక్రమార్క. పెద్దన్న మల్లు అనంతరాములు... వీరి కుటుంబం నుంచి మొదట రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలవడంతో పాటు, పార్టీలో పలు కీలకపదవుల్లో పనిచేశారాయన. ఆ నేపథ్యం వల్లే భట్టి విక్రమార్క విద్యార్ధి దశలోనే రాజకీయాల వైపు వచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీలో పీజీ చదివే సమయంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా పనిచేశాడు. అప్పుడే నందినితో పరిచయమైంది ఆయనకి.

భట్టిని ప్రేమించి గుజరాత్ అమ్మాయి..

నిజానికి నందిని కుటుంబం గుజరాత్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడింది. భట్టి విక్రమార్కతో ఓయూలో అయిన పరిచయం ప్రేమగా మారింది. ఆమే మొదట తన ప్రేమని భట్టికి తెలిపారట. తన రాజకీయ అభిప్రాయాలకి తగిన అమ్మాయి అనిపించడంతో ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ నందిని తల్లిదండ్రులు మాత్రం మొదట వీళ్ల ప్రేమని ఒప్పుకోలేదు. పాలిటిక్స్ అంటూ తిరిగే మనిషి అని తెలియడంతో నందిని తల్లిదండ్రులు భయపడ్డారట. అయితే క్రమంగా భట్టి వ్యక్తిత్వం అర్ధం కావడంతో వాళ్లే ఆమెనిచ్చి పెళ్లి చేసేందుకు ముందుకొచ్చారు.

రాజకీయాల్లోనూ చేదోడుగా..

వివాహం తర్వాత భట్టి విక్రమార్క రాజకీయ జీవితానికి చేదోడుగా నిలిచారామె. ఆయనతో పాటు ఎన్నోసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నందిని. అలాగే ఆయన పాదయాత్ర చేసిన సమయంలోనూ వెన్నంటే ఉన్నారు. ప్రస్తుతం నందిని కూడా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఖమ్మం ఎంపీ సీటు కోసం దరఖాస్తు కూడా చేశారు. ఆమె బరిలో దిగి గెలిస్తే... వీరి ప్రేమ పొలిటికల్ గానూ పెద్ద సక్సెస్ అయిందని అనుకోవచ్చు.

#deputy-cm #bhatti-vikramarka #love-story
Advertisment
Advertisment
తాజా కథనాలు