Rs.2000 Notes : ఏప్రిల్ 1న ఆ నోట్ల ఎక్చ్సెంజ్ కుదరదు! కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. By Bhavana 30 Mar 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి No Exchange Of Rs.2000 : కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల(Rs.2000 Currency Notes) గురించి ఆర్బీఐ(RBI) మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం(Financial Year) మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. ఆదివారం తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో అకౌంట్లు క్లోజింగ్ కోసం కొన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు(No Exchange) ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్ల మార్పిడి సేవలు ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభం అవుతాయని ఆర్బీఐ వెల్లడించింది. గతేడాది మే లో రూ. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎవరి వద్దైనా ఈ నోట్లు ఉన్నట్లయితే 2023 సెప్టెంబర్ లోపు మార్చుకోవాలని ముందు అవకాశం కల్పించింది. ఆ తరువాత నుంచి రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 1, 2024 న గణాంకాల ప్రకారం.. మే 19 వరకు చలామణిలో ఉన్న 97. 62 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు వచ్చేశాయి. ఈ లెక్కల ప్రకారం ఇంకా మార్కెట్లో రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ నోట్లను ఉన్నవారు నేరుగా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి మార్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. పోస్టాఫీస్ ద్వారా సేవలు పొందొచ్చు. Also Read : టైర్ల గోదాంలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు! #rbi #financial-year #2000-notes #no-exchange మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి