Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !

రాజకీయాల్లో అధికారం మారాక నిర్మాణాల కూల్చివేత పరిపాటి అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే వైసీపీ ఆఫీస్‌ను కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా !
New Update

Demolition Trend : అది 2019 జూన్ 26.. అప్పటికి జగన్‌ (YS Jagan) సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు మాత్రమే దాటింది. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎం (CM Chandrababu) గా ఉన్న కాలంలో అనేక అక్రమ కట్టడాలు నిర్మించారని జగన్‌ సీరియస్‌గా ఉన్న రోజులవి.. కలెక్టర్లతో సమావేశం పెట్టిన జగన్‌ ఆ వెంటనే గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. జగన్‌ ఆదేశాలు ఇచ్చిన రోజే ప్రజావేదిక కూల్చుడు ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత 5ఏళ్ల పాలనలో జగన్‌ ఎలాంటి కూల్చివేతలకు ఆదేశించలేదు..! సీన్‌ కట్‌ చేస్తే.. 2024.. జగన్‌కి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అటు జగన్‌కు, వైసీపీ (YCP) కి సంబంధించిన నిర్మాణాల కూల్చివేతను కూటమి ప్రభుత్వం షురూ చేసింది.

Also Read: నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం

తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. ప్రొక్లెయిన్లు, బుల్డోజర్లతో ఆఫీస్‌ వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవాన్ని కూల్చివేశారు. ఇక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ వెళ్లకుండా గేట్లు వేసి భారీగా పోలీసులను మోహరించారు. నిజానికి నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రోసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ వైసీపీ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించింది. చట్టాన్ని మితిమీరి వ్యవహరించొద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది. అయినా కూడా మున్సిపల్ అధికారులతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరుపుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు దిగారని మాజీ సీఎం జగన్‌ మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని జగన్‌ అంటున్నారు. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో చంద్రబాబు రక్తాన్ని పారిస్తున్నారని ట్వీట్ చేశారు.

Also Read: వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే

ఇటు తెలంగాణ (Telangana) లోనూ జగన్‌కు రేవంత్‌ సర్కార్‌ షాక్ ఇచ్చింది. జూన్ 16న బంజారాహిల్స్‌ లోటస్ పాండ్‌లోని జగన్ నివాసం కాంపౌండ్ వాల్‌కు ఆనుకుని ఉన్న నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణాలు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని, ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నాయని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఇక రోడ్డును ఆక్రమించి మ‌రీ ఈ నిర్మాణాలు చేప‌ట్టార‌ని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కూల్చివేతలు కక్షపూరితమన్న కామెంట్స్‌ వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టారు. దీనిపై వైసీపీ నేతలతో పాటు అటు కాంగ్రెస్‌ లీడర్‌ షర్మిల కూడా మండిపడ్డారు. అటు సోషల్‌మీడియాలో కొంతమంది టీడీపీ చర్యలను ప్రతికార చర్యగా అభిప్రాయపడుతున్నారు. ప్రజావేదికను 2019లో జగన్‌ ప్రభుత్వం కూల్చడం కారణంగానే ఇప్పుడీ కూల్చివేతలు చేపడుతున్నారన్న వాదన వినిపిస్తున్నారు. అయితే అక్రమ కట్టడాలు ఎవరివైనా, ఎంతటివారివైనా కూలాల్సిందేనని టీడీపీ మద్దతుదారులు కౌంటర్ వేస్తున్నారు!

#telugu-news #ap-cm-chandrababu #ys-jagan #demolition
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe