/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T171700.843.jpg)
Actress Tapsi Pannu : సినిమా సెలెబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు జనాలంతా సెల్ఫీల కోసం ఎగబడే రోజులివి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్స్ కనిపిస్తే సెల్ఫీల కోసం క్యూ కడతారు. సెలెబ్రిటీతో ఫోటో దిగేంత వరకు అక్కడి నుంచి వెళ్ళరు. అలాంటిది ఓ డెలివరీ బాయ్ తన ఎదురుగా స్టార్ హీరోయిన్ వస్తున్నా కూడా ఆమెని ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సి తాజాగా ముంబై లోని ఓ సెలూన్ నుంచి బయటికొచ్చింది. దీంతో ఆమె కోసం బయటే వేచి చూస్తున్న ఫోటో గ్రాఫర్స్ ఫొటోలు తీసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అదే సెలూన్ లోకి వెళ్ళాడు.
తాప్సిని పట్టించుకోని డెలివరీ బాయ్
సరిగ్గా అదే టైమ్ లో ఎదురుగా హీరోయిన్ తాప్సి వస్తున్నప్పటికీ డెలివరీ బాయ్ ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తన పనేంటో తాను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడి ఫోటో గ్రాఫర్స్ జరుగూ అంటూ గట్టిగా అరిచినా ఎవ్వరినీ లెక్కచేయకుండా లోపలికి వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆ డెలివరీ బాయ్ డెడికేషన్ ని మెచ్చుకుంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ కొందరేమో ఆ డెలివరీ బాయ్ తాప్సిని గుర్తుపట్టి ఉండడని, ఆమె ఎవరో అనుకొని పట్టించుకోలేదని అంటున్నారు.
Hey @Swiggy, this delivery partner deserves an incentive for his dedication!! 😬😂
— Divya Gandotra Tandon (@divya_gandotra) May 19, 2024