Delhi: బికినీతో బస్సు ఎక్కిన భామ..వీడియో చూసి ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కొంతమంది ప్రజలు పద్ధతీ, పాడూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మెట్రో రైళ్లలోనే అనుకుంటే.. ఇప్పుడు ఓ మహిళ.. బికినీతో బస్సు ఎక్కింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. By Durga Rao 18 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీలో కొంతమంది ప్రవర్తన.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. వాళ్లు చేసే తప్పుడు పనులు.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటివరకూ ఢిల్లీ మెట్రో రైళ్లలో అసభ్య ప్రవర్తనల ఘటనలు చూశాం. ఇప్పుడు ఢిల్లీ బస్సుల్లో కూడా ఇలాంటి దృశ్యాలు కామనవుతూ.. ఛిఛీ అనిపిస్తున్నాయి.ఈ ఘటన ఢిల్లీ డీటీసీలో జరిగింది. ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీతో రావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఘటనకి సంబంధించిన వీడియోని ట్విట్టర్ (X)లో @DELHIBUSES1 అకౌంట్ నుంచి ఏప్రిల్ 17, 2024న పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటికే 10వేల మందికి పైగా చూశారు. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోని గమనిస్తే.. ప్రజా రవాణా బస్సులోకి ఓ మహిళ బికినీలో వచ్చింది. ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. “ఈమె ఎవరు ఇలా వచ్చిందేంటి” అని అనుకుంటూ బిత్తరపోయారు. కొంతమంది రామ రామ అనుకుంటూ.. తమ సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. మరికొందరు.. రోజులు బాలేవు అనుకుంటూ.. తల పక్కకు తిప్పుకున్నారు. ఓ ముసలామె.. అలా వెళ్లి.. ఆ సీట్లో కూర్చో అని ఆ మహిళకు సలహా ఇచ్చింది. दिल्ली की बसों की व्यवस्था पूरी तरह से बदहाल हो चुकी हैं । दिल्ली मैट्रो से ज्यादा असुरक्षित हैं दिल्ली की बसें । यह तो एक छोटी सी घटना हैं हर रोज़ सैकड़ो लोगों की बसों में जेब कट रही हैं उसका जिम्मेदार कोन हैं....?#delhi #DelhiMetro #bus #DTC #CLUSTER #aap #BJP@kgahlot pic.twitter.com/FzEe26UuCe — Delhi Buses (@DELHIBUSES1) April 17, 2024 చూశారుగా ఇదీ పరిస్థితి. ఆ మహిళను గమనిస్తే, ఆమె అప్పుడే స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టి వచ్చినట్లు ఉంది. ఆమె జుట్టు, బికినీ కూడా తడిగా ఉంది. అసలు ఆమె అలా ఎలా వచ్చింది? ఎలా బస్ ఎక్కింది? ఎందుకిలా చేసింది? ఇలా ఎన్నో ప్రశ్నలు.ఢిల్లీ రవాణా వ్యవస్థలో DTC బస్సులు కీలకమైనవి. ఢిల్లీ మెట్రో తర్వాత ప్రజలు ఎక్కువగా ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. “లా అండ్ ఆర్డర్ ఎక్కడ? ఆమెను ఎలా అనుమతించారు” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మగవాళ్లు ఇలా చేసి ఉంటే.. ఏమయ్యేది” అని మరో యూజర్ ప్రశ్నించారు. “ఎండ 40 డిగ్రీలు ఉంటే.. పరిస్థితి ఇలాగే ఉంటుంది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. #viral-video #viral-news #viral-videos మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి