Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కవితకు జైలా.. బెయిలా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..
New Update

Kavitha Bail : ఎమ్మెల్సీ కవిత ఈడీ(ED) రిమాండ్‌ ఇవాళ్టి(మార్చి 26)తో ముగియనుంది. ఢిల్లీ(Delhi) లోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్‌ను ఇవాళ్టి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత ఇప్పటికే అనేకమార్లు చెప్పారు. ఇది రాజకీయ కేసు, కల్పిత కేసు, తప్పుడు కేసు అని అంటున్నారు. అవే విషయాలను పదేపదే అడుగుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు. ఇది పొలిటికల్ అరెస్ట్ అని భారత్ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు.

బెయిల్‌ ఇస్తారా?
మరోవైపు కవిత ఈడీ కస్టడీని పొడిగిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళే విచారణ జరపనుంది. కవితకు బెయిల్ లభించకపోతే ఆమెను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆమ్‌ ఆద్మీ నేతలు ఇదే జైల్లో కాలం గడుపుతున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా(Manish Sisodia) ఇదే జైల్లో ఉన్నారు. ఇక కవిత కస్టడీను పొడిగించాలని ఈడీ కోరనుంది. ఇప్పటికే ఈడీ కస్టడీలో కవిత 10 రోజులు ఉన్నారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకోని విచారిస్తోంది. ఆయన్నే ఈ కేసుకు 'కింగ్‌పిన్'గా చెబుతోంది.

త్వరగా విచారించాల్సిందే:
ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు(Supreme Court) గత శుక్రవారం తిరస్కరించింది. దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను త్వరితగతిన పరిష్కరించే ఆదేశాలతో ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని కోరింది. రాజకీయ వ్యక్తులు కాబట్టి బెయిల్ కోసం నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అనుమతించలేమని వ్యాఖ్యానించింది. వేరే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని త్వరితగతిన తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 15న ఈడీ బృందం కవితను అరెస్ట్ చేసింది. హైదరాబాద్(Hyderabad) లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో లబ్ధి పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నారని, ఈ ప్రయోజనాలకు బదులుగా ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో ఆమె పాలుపంచుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తోంది.

Also Read : చిక్కుల్లో ఎర్రబెల్లి.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు!

#ed #delhi-liquor-scam #kalvakuntla-kavitha #kavitha-bail
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి