MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు!

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్‌ మాదాపుర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

MLC Kavitha: కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు!
New Update

ED Raids - Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో సంబంధం ఉందని భావిస్తున్నా ఏ ఒక్కరిని వదలకుండా ఈడీ సోదాలు చేస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బంధువుల ఇళ్లలో ఈడీ (ED) తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్‌ మాదాపుర్‌లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. మరోవైప ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవితతో పాటు అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.


బిగుస్తోన్న ఉచ్చు:

అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన రూస్ అవెన్యూ కోర్టు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి మార్చి 23(ఇవాళ్టి) వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం అక్రమమంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్టు. PMLA కేసులతో ట్యాగ్ చేసింది ధర్మాసనం. మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఈడీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లో ఈడి తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

అటు కేజ్రీవాల్.. ఇటు కవిత:
మరోవైపు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారో ఈడీ తొలిసారిగా కోర్టుకు తెలిపింది.మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ సూత్రధారి అని ఈడీ పేర్కొంది. మద్యం వ్యాపారులకు మేలు చేసే లిక్కర్ పాలసీని రూపొందించింది కేజ్రీవాలే అని ఈడీ పేర్కొంది. ఈ పాలసీ ద్వారా దాదాపు రూ.600 కోట్ల లాభం వచ్చిందని ఈడీ తెలిపింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ కిక్‌ బ్యాక్‌గా రూ.100 కోట్లు అందుకుందని వివరించింది. ఇందులో గోవా ఎన్నికల్లో రూ.45 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. డబ్బు పంపిణీ చేసిన అభ్యర్థులు ప్రకటనలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఇక ఇవాళ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. కవితను, కేజ్రీవాల్‌ను ఒక చోటే ఉంచి ఈడీ ప్రశ్నలు అడుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు 6 రోజుల కస్టడీ

#mlc-kavitha #delhi-liquor-scam-case #delhi-liquor-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe