Delhi High Court: కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవి విషయంలో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కాస్త ఊరట లభించింది. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కాదని తేల్చి చెప్పింది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

Aravind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి వచ్చే అశం కాదని..రాజకీయాలకు సంబంధించిందని..అందువల్ల తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ అంశం ఎగ్జిక్యూటివ్‌ పరిధిలోనిదని హైకోర్టు పేర్కొంది. కస్టడీలోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ను తొలగించడం తప్పనిసరి అని ఏ చట్టమైనా చెప్పిందా అంటూ కోర్టు ప్రశ్నించింది.

#BREAKING

Delhi High Court rejects PIL seeking removal of Arvind Kejriwal from the post of Chief Minister of Delhi. #ArvindKejriwal #ED #DelhiHighCourt pic.twitter.com/eDhvboWQpx

— Live Law (@LiveLawIndia) March 28, 2024

పదవి నుంచి తప్పించాలంటూ పిల్..

ఆరు రోజుల క్రితం ఈడీ అధికారులు డిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని గత శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఏ అధికారంతో ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారో వివరించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీని అడగాలని సూర్జిత్ సింగ్ యాదవ్ తన పిటిషన్‌లో డిమాండ్ చేశారు. దాంతో పాటూ కేజ్రీవాల్‌ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈరోజుతో ముగిసిన కేజ్రీవాల్ కస్టడీ..

మరోవైపు ఇవాళ అందరి చూపులూ ఢిల్లీ మీదనే ఉన్నాయి. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) లో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతే. ముఖ్యమంత్రి కేజ్రీవాల్(Kejriwal) కస్టడీ ఈరోజుతో ముగియనుండడంతో ఈడీ(ED) ఈరోజు ఆయనను కోర్టులో హాజరపర్చనుంది. మధ్యాహ్నం 2గంటలకు కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకెళ్ళనున్నారు. విచారణ తర్వాత కోర్టు కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తుందా… లేదంటే రిమాండ్‌ కు తరలించాలని ఆదేశిస్తుందా అనేది చూడాలి. అదీ కాకుండా ఈరోజు కేజ్రీవాల్ కోర్టులో ఏం చెప్పనున్నారు అనే దాని గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read:Supreme Court : న్యాయవ్యవస్థకు ముప్పు..సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ

#aravind-kejriwal #delhi-high-court #cm
Advertisment
తాజా కథనాలు