Delhi: గవర్నర్ సంచలన నిర్ణయం.. ఆ 223 మంది ఉద్యోగుల తొలగింపు!

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్‌లోని 223 మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ గా ఉన్న ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఈ నియామకాలు చేపట్టడంలో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.

New Update
Delhi: గవర్నర్ సంచలన నిర్ణయం.. ఆ 223 మంది ఉద్యోగుల తొలగింపు!

VK Saxena: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్‌లోని 223 మంది మహిళా ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ గా విధులు నిర్వహిస్తున్న టైమ్ లో ఈ నియామకాల చేపట్టడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఈ సందర్భంగా గవర్నర్ స్పష్టం చేశారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తే మహిళా కమిషన్‌ ను రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంపై స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేశారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే..
ఈ మేరకు కమిషన్‌లో 90 మంది ఉద్యోగులుండగా వారిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు తెలిపారు. మిగిలిన వారందరికి 3 నెలల ఒప్పందం ఉంటుందని, ఇక ఈ మహిళా కమిషన్‌ను రూపొందించడానికి చాలా మంది చెమట, రక్తం చిందించారని గుర్తు చేశారు. తనను జైలుకు పంపినా మహిళా కమిషన్‌ను మూసేసే పరిస్థితి రానివ్వమని చెప్పారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండానే 223 కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. మహిళా కమిషన్ చట్టం ప్రకారం సిబ్బందిలో 40 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకునే అధికారం కమిషన్‌కు లేదని అన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Game Changer: ఆర్టీవీకి హ్యాట్సాఫ్.. రవిప్రకాష్ ఎంట్రీతో వారికి గజ గజ: బండి సంజయ్ సంచలనం

అదనపు ఆర్థిక భారం..
ఇక ఫిబ్రవరి 2017లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నియామకాలకు ముందు, అవసరమైన ఖాళీలను భర్తీ చేయలేదని, ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఈ నియామకాలు ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపాయని పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ విధానాలు ఏర్పాటు చేసిన విధానాలకు అనుగుణంగా నిర్వహించబడలేదని పేర్కొన్నారు. ఢిల్లీ కమిషన్‌కు జీతాల పెంపు మార్గదర్శకాలు కూడా మహిళా ఉద్యోగులకు అనుగుణంగా లేవన్నారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాతి మలివాల్.. 9ఏళ్లపాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ గా పనిచేశారు.

Advertisment
తాజా కథనాలు