Crime: బిర్యానీ కోసం 60 సార్లు పొడిచి చంపేశాడు! ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. బిర్యానీ కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదని పొరుగింటి యువకున్ని ఓ మైనర్ బాలుడు 60 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన మొత్తం అక్కడ సీసీ టీవీలో రికార్డు అయ్యింది. బాధితుడు, నిందితుడు ఇద్దరు కూడా మైనర్లే. By Bhavana 23 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి దేశ రాజధాని నగరం ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. బిర్యానీ తినడానికి పొరుగింటి వ్యక్తిని డబ్బులు అడగగా అతను లేవని చెప్పడంతో అతని మీద దాడి చేయడంతో పాటు అతని వద్ద ఉన్న కత్తితో సుమారు 60 సార్లు పొడిచి చంపాడు. ఈ ఘటనలో నిందితుడు, బాధితుడు ఇద్దరు కూడా మైనర్లే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని వెల్ కమ్ ఏరియాలో స్వాగత ప్రాంతంలోని జాఫ్రాబాద్ సమీపంలోని మురికివాడలో ఈ మైనర్లు ఇద్దరు కూడా నివాసం ఉంటున్నారు. నిందితుడు ఇప్పటికే ఓ హత్య కేసులో ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు. జనతా మజ్దూర్ కాలనీ సమీపంలో నిందితుడు బాధితుణ్ని పట్టుకుని బిర్యానీ తినేందుకు రూ.350 అడిగాడు. దీంతో ఆ యువకుడు తన దగ్గర లేవని నిరసన తెలపడంతో నిందితుడు..అతని పై దాడి చేసి డబ్బు లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే నిందితుడు డబ్బును లాక్కోవడంలో సఫలం కాకపోవడంతో ముందు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత నిందితుడు జేబులోంచి కత్తి తీసి దాడికి దిగాడు. నిందితుడు మృతున్ని సుమారు 60 సార్లు పైగా పొడిచి చంపినట్లు..అక్కడి సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో బాధితుడు అక్కడికక్కడే నేలకొరిగాడు. నిందితుడు ముందు బాధితుడి చుట్టూ డ్యాన్స్ చేశాడు. ఆ తరువాత మృతుని కాలు పట్టుకుని ఓ వైపునకు లాగడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు బాధితుణ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే బాధితుడు మరణించినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడైన బాలుడిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఫుటేజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Also read: చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్..మరికాసేపట్లో బయటకు కార్మికులు! #murder #delhi #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి