Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో ఆమెకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించింది.

Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు మరో బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ
New Update

Puja Khedkar Bail Rejected: వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు (Delhi Court) తిరస్కరించింది. అలాగే ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో UPSCకి చెందిన వారు ఎవరైనా ఆమెకు సాయం చేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశించింది. UPSC అభ్యర్థుల్లో పూజా లాగే ఇంకెవరైనా తప్పుడు సర్టిఫికేట్లతో ప్రయోజనాలు పొందారా అనే దానిపై కూడా విచారణ చేయాలని సూచించింది.

Also Read: ధరణి ఔట్.. తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం

ఇదిలాఉండగా.. పూజా ఖేద్కర్‌ పూణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చారు. అలాగే యూపీఎస్సీకి తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగం పొందారనే విషయం కూడా బయటపడింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన UPSC.. బుధవారం పుజా ఖేద్కర్‌ సివిల్స్‌ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భవిష్యత్తులో కూడా ఆమె మళ్లీ పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది.

Also Read: SC/ST ఉప వర్గీకరణకు అనుమతి.. క్రీమీ లేయర్‌ వర్తింపజేయాల్సిందేనా ?

#telugu-news #upsc #puja-khedkar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe