Delhi Liquor Case: ముచ్చటగా మూడోసారీ డుమ్మా.. మరోసారి విచారణకు దూరంగా కేజ్రీ!

ఢిల్లీ లిక్కర్‌ కేసులో మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారు. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ రాశారు.

New Update
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ కేసు(Delhi Excise Case)లో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) డుమ్మా కొట్టారు. ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.ఈడీ(ED)కి సహకరించేందుకు అరవింద్ కేజ్రీవాల్ సుముఖంగా ఉన్నారని ఆప్ పేర్కొంది. అయితే సమన్ల వెనుక ఉద్దేశం ఆయన అరెస్టుకు వీలు కల్పించడమేనని ఆప్‌ వాదిస్తోంది. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఈడీ నోటీసు చట్టవిరుద్ధమంటోంది. ఆయనను ఎన్నికల ప్రచారం నుంచి అడ్డుకోవాలని చూస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది.

విపాసన ప్రక్రియ సాకుతో:
ఎక్సైజ్ పాలసీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జనవరి 3(ఇవాళ)న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అంతకుముందు ఈడీ గతంలో నవంబర్ 2, డిసెంబర్ 21, 2023న కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే ఆయన రెండు సందర్భాలలోనూ ఫెడరల్ ఏజెన్సీ ముందు హాజరు కావడానికి నిరాకరించారు. ఓసారి ఎన్నికల ప్రచారం.. మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆప్‌ చుట్టూ మొదటి నుంచి ఉచ్చు:
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రశ్నించింది . అయితే, గతేడాది(2022) ఆగస్టులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆయన్ను నిందితుడిగా పేర్కొనలేదు. ఇదే కేసులో ఆప్ సీనియర్ నేత, ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, మరో నేత సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్‌సిసోడియాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణకు పిలిచిన సీబీఐ ఆ తర్వాత అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా తొమ్మిది గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో మద్యం పాలసీని రద్దు చేశారు.

Also Read: వైరల్‌గా మారిన బరాత్‌ వీడియో… పెళ్లికి వరుడు ఎలా వచ్చాడో చూడండి..!

WATCH:

Advertisment
తాజా కథనాలు