Delhi: యాక్షన్‌లోకి దిగిపోయిన ఆప్ సీఎం కేజ్రీవాల్..ఢిల్లీలో రోడ్‌షో

జైలు నుంచి విడుదల అవ్వగానే యాక్షన్‌లో దిగిపోయారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇప్పటివరకు జైల్లో ఉండడం వలన ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన ఆయన ఈ ఒక్క రోజు మాత్రం ప్రజలను కలవలాని డిసైడ్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం నాలుగు నుంచి 6 వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.

Delhi: యాక్షన్‌లోకి దిగిపోయిన ఆప్ సీఎం కేజ్రీవాల్..ఢిల్లీలో రోడ్‌షో
New Update

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూన్ 4 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నిన్న ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. కరెక్ట్‌గా ఎన్నికల ప్రచారం ఒకరోజులో ముగుస్తుంది అనగా కేజ్రీవాల్ బయటకు వచ్చారు. దీంతో ఈ ఒక్కరోజును ఆయన ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు ఉదయం కన్నాట్ ప్లేస్‌లో హనుమాన్ ఆలయాన్ని దర్శించడంతో మొదలుపెట్టి సాయంత్రం ఆరు వరకు ఢిల్లీలో తిరగనున్నారు.

కేజ్రీవాల్ మధ్యాహ్నం 1 గంటలకు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. దీని తరువాత దక్షిణ ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు, తూర్పు ఢిల్లీలోని కృష్ణానగర్‌లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో నేరుగా ప్రజలను కలిసి వారితో మాట్లాడనున్నారు. దానికన్నా ముందు విలేకరుల సమావేశంలో దేశంలో ఎన్నికలు..పార్టీలు లాంటి విషయాల గురించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. దాంతో పాటూ ప్రజలు అందరూ తమ ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించనున్నారు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడాలని ప్రజలకు కేజ్రీవాల్ విన్నవించనున్నారు.

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనకు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి సుప్రీంకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శనివారం నుంచి ప్రచారంలో నిమగ్నం కానున్నారు.

Also Read:Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో క్లైమాక్స్‌కు చేరిన ఎన్నికల ప్రచారం..

#delhi #aravind-kejriwal #election-campaigning
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe