Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

2011 వరకు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో రాజకీయ పునాదులు వేసుకున్న కేజ్రీవాల్ నేడు అవే అరోపణలతో అరెస్ట్ అయ్యారు. మామూలు వ్యక్తి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రస్థానం ఇదే..

New Update
Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే..

Delhi CM Aravind Kejriwal : మామూలుగా వ్యక్తిగా మొదలైన అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణం ఢిల్లీ ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్రను పోషించేవరకు కొనసాగింది. ఐఆర్ఎస్ ఉద్యోగిగా సామాజిక పోరాటాలతో మొదలెట్టి..ప్రజల్లోకి వెళ్ళి పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగారు.  అవినీతికి వ్యతిరేకంగా వేసిన  కేజ్రీవాల్ అడుగులు చివరకు అదే అవినీతిలో అరెస్ట్ అయ్యేందుకు దారి తీశాయి.  అవినీతి పోరాటాలతో దేశంలో మారు మోగిన ఆయన పేరు నేడు మళ్ళీ ఈడీ అరెస్ట్‌తో మరొకసారి హాట్‌టాపిక్‌గా మారింది.  కేజ్రీవాల్ ఎక్కడైతే, దేని గురించి అయితే తన పోరాటాన్ని మొదలుపెట్టారో...ఇప్పుడు అదే మరకతో నిన్న అరెస్ట్ అయ్యారు.

సామాన్య పౌరుడిగా..

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రస్థానంలో చాలా మలుపులు ఉన్నాయి. ఎలాంటి రాజకీయ వారసత్వం లేని వారు కేజ్రీవాల్. బాగా చదవుకుని ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన కేజ్రీవాల్ సామాజిక కార్యకర్తగా రంగంగలోకి దిగారు. ఈ పని చేయడానికి ఆయన తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఆ తరువాత ఢిల్లీలో పరివర్తన్ అనే సంస్థను స్థాపించి...స్నేహితులతో కలిసి లోకల్ సమస్యల మీద పని చేశారు. ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిన ఇప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేవారు. అప్పట్లో నమాచార హక్కు కోసం జరిగిన ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 2006లో ఎమర్జింగ్ లీడర్ షిప్ విభాంగలో కేజ్రీవాల్‌కు రామన్ మెగెసెసే అవార్డుకూడా దక్కించుకున్నారు. ఇక 2010లో డిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా అగైనెస్ట్ కరప్షన్ అని జరిగిన ఉద్యమంలో కేజ్రీవాల్‌ ప్రముక పాత్ర పోసించారు. ఆయన ఉద్యమాన్ని ముందుండి నడిపించారు కూడా.

మలుపు తిప్పిన జన్‌లోక్‌పాల్ ఉద్యమం..

2011 నుంచి కేజ్రీవాల్ అసలు రాజకీయ జీవితం ప్రారంభం అయింది. గాంధేయవాదిగా పేరుగాంచిన అన్నాహజారే జన్‌లోక్‌పాల్‌ కోసం డియాండ్ చేస్తూ డిల్లీ జంతర్‌మంతర్ దగ్గర చేసిన ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ పాత్ర పోసించారు. అన్నా హజారే వెనుకనే ఉంటూ ఉద్యమం చేశారు. దీని తరువాత కేజ్రీవాల్‌కు జనాల్లో బాగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత నుంచి డిల్లీలో పెద్ద పెద్ద సభలు నిర్వహించడం...అందులో రాజకీయ నాయకుల మీద విరుచుకుపడడం చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు యాంగ్రీ యంగ్ మాన్ అనే ఇమేజ్ కూడా వచ్చింది. దేశంలో యువత కూడా చాలా మంది కేజ్రీవాల్‌ను సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2012లో అదే ఢిల్లీలో...అదే జంతర్‌మంతర్‌ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అప్పుడు ఈయనకు సపోర్ట్‌గా అన్నా హజారే కూడా ఇందులో పాల్గొన్నారు. మొత్తం 10 రోజులు నిరాహార దీక్ష చేవారు. దీని తరువాత ఇలా చిన్నగా చేయడం కాదు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని భావనతో రాజకీయాల్లోకి ప్రవేశించారు కేజ్రీవాల్.

ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపన...

2012 నవంబర్ 26 ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. తమ పార్టీ ప్రజల కోసమే అని ప్రకటించారు. పార్టీలో హైకమాండ్ అంటూ ఏమీ ఉండదని..ప్రజల విరాళాలతో..ప్రజల సమస్యలే అజెండాగా పోటీ చేస్తామని ప్రకటించారు. పార్టీ కోసం వాలంటీర్లను నియమించుకున్నారు. 2013లో డిల్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీ చేసిన 70 స్థానాలకు గానూ 28 సీట్లు గెలిచారు. అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ మీద పోటీకి నిలబడిన కేజ్రీవాల్ 25 వేలకు పైగా ఓట్లతో మెజారిటీని సంపాదించుకున్నారు. అప్పుడు ఢి్లీలో ఏ పర్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాయి. కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మూడు సార్లు ముఖ్యమంత్రిగా..

అయితే తాను ముఖ్యమంత్రాగా ఉన్న కాలంలో జన్‌లోక్‌పాల్‌ బిల్లను తీసుకురావాలని చాలా ప్రయత్నించారు అరవింద్ కేజ్రీవాల్. కానీ కాంగ్రెస్ దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఆయన 2014లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేశారు. మళ్ళీ జనంతో కలిసి జన్‌లోక్‌పాల్ కోసం పోరాటం చేశారు. ఇక 2015 లో జరిగిన ఎన్నికల్లో ఆప్ పార్టీ మళ్ళీ పోటీ చేసిన ఘన విజయం సాధించింది. 70 స్థానాలకు 67 సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కేజ్రవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే 2020 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఈసారి కూడా 70 స్థానాలకు 62 గెలుచుకుంది. దీంతో మూడోసారి ముచ్చటగా కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

జాతీయ స్థాయి పార్టీగా...

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పుడుకూడా ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగానే ఉంది. పైడీ ఈసారి ఎన్నికల్లో ఈ పార్టీ ఇండియా కూటమితో చేతులు కలిపింది. ఆప్ పార్టీ క్రమంగా కాలంతో పాటూ తమ పార్టీ జాతీయ స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్ళింది. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి మెజారిటీ లభించగా, ఉత్తర్‌ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 100 మంది ఆప్ అభ్యర్థులు విజయం సాధించారు.గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. గత ఏడాది ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. ఒంటిచేత్తో పార్టీని నడిపించి దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్‌ని తీసుకువెళ్లారు.

ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి ఢిల్లీ, హరియాణా, గుజరాత్​ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటే లక్ష్యంగా ఆమ్​ ఆద్మీ పార్టీ వెళుతున్న నేపథ్యంలో నిన్న కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యారు. ఎన్నికల ముంగిట పార్టీ కార్యకలాపాలు, వ్యూహ రచన, అమలులో కేజ్రీవాల్​ కేంద్రంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అరెస్టు ఎన్నికల్లో ఆప్​ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్ హస్తం ఉందని ఒకవైపు వినిపిస్తుంటే...మరోవైపు కావాలనే బీజేపీ ప్రభుత్వం ఆయనను ఎన్నికల ముందు అరెస్ట్ చేయిందని మరో వాదన వినిపిస్తోంది.

Also Read:Andhra Pradesh: ఎన్నికలను బహిష్కరించండి.. ఏపీ ఓటర్లకు మావోయిస్టుల లేఖ

Advertisment
తాజా కథనాలు