Fire Accident: పెయింట్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. పదకొండు మంది సజీవ దహనం!

ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్‌ వద్ద ఓ పెయింట్ల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

New Update
Fire Accident: పెయింట్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. పదకొండు మంది సజీవ దహనం!

Delhi:  ఢిల్లీ(Delhi) లోని అలీపూర్‌(Alipur)  ప్రాంతంలోని ఓ పెయింట్‌ ఫ్యాక్టరీ(paint Factory) లో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనం అయ్యారు. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో 9 మంది కాలిపోయిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. .

సాయంత్రం 5.25 గంటలకు మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రాగా.. వెంటనే అక్కడికి 22 ఫైరింజన్లతో వెళ్లినట్లు వివరించారు. రాత్రి 9 గంటలకు కానీ మంటలు అదుపులోనికి రాలేదని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ అధికారి ఒకరు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో మంటలు భారీగా చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా ఉందని అధికారులు వివరించారు.

మృతుల్లో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు. మంటలు చెలరేగడంతో కార్మికులు దాన్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అప్పుడు ఫ్యాక్టరీలో ఉంచిన రసాయన డ్రమ్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో లోపల ఉన్న కార్మికులు బయటకు రాలేకపోయారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు చిక్కుకుపోయి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

CATS అంబులెన్స్, PCR కూడా సంఘటన స్థలంలో మోహరించారు. ఫ్యాక్టరీ నుంచి ఎగసిపడుతున్న పొగ అనేక కిలోమీటర్ల మేర కనిపిస్తుంది.

Also read: బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..’ రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!

Advertisment
తాజా కథనాలు