Delhi Liquor Scam : సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో డిఫెక్ట్

తన అరెస్ట్ అక్రమం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.  నిబంధనల మేరకు పూర్తిగా సమర్పించిన తర్వాతనే విచారణ చేస్తామని తెలిపింది. అప్పటివరకు విచారణనను వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పింది. 

New Update
Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు!

BRS MLC Kavitha : తన అరెస్ట్ అక్రమం అంటూ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌(RIT Petition) లో డిఫెక్ట్ ఉందని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. పిటిషన్  అసంపూర్తిగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.  నిబంధనల మేరకు పూర్తిగా సమర్పించిన తర్వాతనే విచారణ చేస్తామని తెలిపింది. అప్పటివరకు విచారణను జరపలేమని తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Case) లో తనను అరెస్ట్ చేయడం పై సుప్రీం కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు కవిత. నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం దీని విచారణ జరపాల్సి ఉంది. ఈడి సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.... గతంలో కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై కూడా నేడు విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసు మనీ లాండరింగ్‌(Money Laundering Case) వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని ఈడి జారీ చేసిన సమన్లు సవాలు చేస్తూ... గత ఏడాది మార్చి 14న రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు కవిత. ఈ పిటిషన్‌ను అంతకు ముందే దాఖలైన అభిషేక్‌ బెనర్జీ, నళినీ చిదంబరం పిటిషన్లకు జత చేసి సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. సిఆర్‌పిసి సెక్షన్‌ 160 ప్రకారం... మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా... ఈడి(ED) అధికారులు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని కవిత పిటిషన్‌లో పేర్కొన్నారు.

కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై అప్పుడే సుప్రీంకోర్టు ఈడికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత దీని మీద పలు మార్లు విచారణ కూడా జరిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత... పలుమార్లు విచారణ జరిగినా... ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే కేసును వాయిదా వేసింది ధర్మాసనం. ఇదే పిటిషన్‌ తాజాగా... ఈనెల 15న మరోసారి జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా నాన్‌ మిస్‌లేనియస్‌ డే రోజు చేపట్టాలని గతంలో నిర్ణయం జరిగిందని.. అందుకు అనుగుణంగా తదుపరి విచారణ చేపట్టాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. అయితే కవిత న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవద్దని, ప్రతిసారి ఏదో ఒక సాకుతో పిటిషన్‌ విచారణకు రాకుండా చేస్తున్నారన్న ఈడి తరపు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు వాదించారు. కానీ కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్‌పై విచారణను ఈ రోజుకు అంటే మార్వాచి 19కు వాయిదా వేసింది జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం. అదే రోజున...సుప్రీంకోర్టులో విచారణ వాయిదా వేసిన రోజు (ఈనెల 15న) సాయంత్రమే కవితను అరెస్టు చేసారు ఈడి అధికారులు. ఈనెల 16న ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచి... వారం రోజులు కస్టడీకి తీసుకుంది. దీంతో ఈడి అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి... కోర్టులో చెప్పిన మాటకు విరుద్దంగా అరెస్టుకు పాల్పడ్డారని మరో పిటిషన్‌ దాఖలు చేశారు కవిత. ఈరెండు పిటిషన్లను కలిపి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు రిట్ పిటిషన్‌లో డిఫెక్ట్(Defect) ఉంది అని చెబుతుండడంతో...రెండు పిటిషన్ల మీద విచారణ చేస్తారా లేదా ఒకదాని మీదనే చేస్తారా అనేది సందేహంగా మారింది.

Also Read : Breaking: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

Advertisment
తాజా కథనాలు