MS Dhoni: చిక్కుల్లో టీమిండియా మాజీ కెప్టెన్...ఎంఎస్ ధోనిపై పరువునష్టం కేసు...!!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై..పరువు నష్టం కేసు నమోదు అయ్యింది. అతని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్,ఆయన భార్య సౌమ్య దాస్ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. క్రికెట్ అకాడమీ పేరుతో రూ. 15కోట్లు మోసం చేశారని ధోని కేసు వేసిన సంగతి తెలిసిందే.

New Update
MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!

MS Dhoni:  భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ధోనీపై మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్‌లు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 2017 ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సంబంధించి తమపై పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా ధోనీ, అతని తరపున వ్యవహరిస్తున్న వ్యక్తులను నిరోధించాలని దివాకర్, దాస్ కోరారు. గతంలో ధోనీ తన ఇద్దరు పాత వ్యాపార భాగస్వాములను మోసం చేశారని ఆరోపించారు. క్రికెట్ అకాడమీని ప్రారంభించే కాంట్రాక్టు తనకు రావాల్సి ఉందని, అయితే అది తనకు ఇవ్వలేదని, తన రూ.15 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని ధోనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ధోనీపై పరువు నష్టం కేసు నమోదైంది:
2017 కాంట్రాక్ట్ ఉల్లంఘనకు సంబంధించి ధోనీ, అతని తరపున వ్యవహరిస్తున్న వ్యక్తులు తమపై పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిరోధించాలని దివాకర్, దాస్‌లు కోర్టును కోరారు. ఈ ఒప్పందం ధోని దివాకర్, దాస్ కంపెనీ ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ మధ్య ఉంది. క్రికెట్ అకాడమీ ఏర్పాటు కాంట్రాక్టును ఇవ్వకుండా ధోనీని సుమారు రూ.15 కోట్ల మేర మోసగించారని దివాకర్, దాస్‌లపై ధోనీ, అతని తరపున పనిచేస్తున్న వ్యక్తులు పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ధోనీ ఈ ఆరోపణలు చేశాడు:
గతంలో ధోనీ తన ఇద్దరు వ్యాపార భాగస్వాములు మోసం చేశారని ఆరోపించారు. క్రికెట్ అకాడమీని ప్రారంభించే కాంట్రాక్టు తనకు రావాల్సి ఉందని, అయితే అది తనకు ఇవ్వలేదని, దాదాపు రూ.15 కోట్ల మేర స్వాహా చేశారని ధోనీ ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై రాంచీ దిగువ కోర్టులో కేసు దాఖలైంది. ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌లపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 406 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) 420 (మోసం) కింద రాంచీ కోర్టులో క్రికెటర్ తరపున క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు ధోనీ ప్రతినిధులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్ విడుదల..టాప్ లో అమెరికా..లాస్ట్ భూటాన్..మరి భారత్ ర్యాంక్ ఎంత?

Advertisment
తాజా కథనాలు