Deepika : ఆ సీన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు.. 'ఫైటర్'లో బోల్డ్ షోపై దీపిక

బాలీవుడ్ నటి దీపిక పదుకొణె తన అప్ కమింగ్ మూవీ 'ఫైటర్' గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దర్శకుడు సిద్ధార్థ్ ఈ మూవీలో తనలోని కొత్త కోణాన్ని పరిచయడం చేశాడంటూ పొగిడేసింది. ప్రేక్షకులు సినిమా ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే మూడు రోజులు పడుతుందని చెప్పింది.

Deepika : ఆ సీన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు.. 'ఫైటర్'లో బోల్డ్ షోపై దీపిక
New Update

Deepika padukone : బాలీవుడ్ నటి దీపిక పదుకొణె స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddart ananad) పై ప్రశంసలు కురిపించింది. హృతిక్ రోషన్ (Hritik roshan), దీపికలు హీరో హీరోయిన్లుగా సిద్ధార్థ్ తెరకెక్కించిన నయా మూవీ 'ఫైటర్' (Fighter) జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దీపిక.. సినిమా విశేషాలతోపాటు తన ప్రెగ్నెంట్, పిల్లల గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంది.

''ఫైటర్' గతంలో ఎప్పుడూ చూడని ఫీలింగ్ కలిగిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హృతిక్‌రోషన్‌తో కలిసి నటించిన ఈ చిత్రం నాలోని విభిన్న యాంగిల్స్ ను దర్శకుడు చూపించాడు. అందుకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కు ధన్యవాదాలు. ఆయన ఆలోచనా విధానం అద్భుతం. అతను సృష్టించిన పాత్రలు ఆడియన్స్‌ హృదయాల్లో స్టిక్కర్లలా అతుక్కుపోతాయ్‌. వాటిని పీక్కోవాలంటే రెండుమూడు రోజులైనా పడుతుంది. నా బాడీపై రషెస్‌ చూస్తున్నప్పుడే గూజ్‌బంప్స్‌ వచ్చాయి. హాలీవుడ్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. నా కెరీర్ మొత్తంలో గొప్ప ప్రదర్శనల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది' అంటూ మురిసిపోయింది.

ఇది కూడా చదవండి : Bandi Sanjay: బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు.. ప్రకటించిన జేపీ నడ్డా!

అలాగే భర్త, నటుడు రణ్‌వీర్ సింగ్‌తో పిల్లలను కనడం గురించి మాట్లాడిన ఆమె.. త్వరలోనే కుటుంబాన్ని ప్రారంభిస్తామని చెప్పింది. 'రణ్‌వీర్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మేము మా స్వంత కుటుంబాన్ని ప్రారంభించే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. నేను కలిసిన పెరిగిన వ్యక్తులు, నా అత్తమామలు, కుటుంబ స్నేహితులను కలుసుకున్నప్పుడు.. 'నువ్వుఏ మాత్రం మారలేదు' అంటూ ఎల్లప్పుడూ చెబుతుంటారు. అది మా పెంపకం ప్రత్యేకతను చెబుతుంది. మా పిల్లలను కూడా అలాగే పెంచాలనుకుంటున్నాం' అంటూ చెప్పుకొచ్చింది.

ఇక సినీ పరిశ్రమలో కీర్తి, డబ్బు సంపాదించడం అనుకున్నంత ఈజీ కాదు.. అయినా ఇప్పటికీ మా ఇంట్లో నన్ను ఎవరూ సెలబ్రిటీలా చూడరు. నా కుటుంబం నన్ను సాధారణ కూతురు, ఆడపిల్లలాగే చూస్తారు. రణ్‌వీర్, నేను మా పిల్లలలో అదే విలువలను పెంపొందించాలని ఆశిస్తున్నామని తెలిపింది. ఇక 2023లో షారుఖ్ తో కలిసి 'పఠాన్', 'జవాన్' రెండు పెద్ద బ్లాక్‌బస్టర్‌లు సొంతం చేసుకన్న దీపిక ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

#deepika-padukone #fighter #siddarth-ananad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe