Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్!

నిన్న ముంబై లో 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీపికా పదుకొణె బేబి బంప్‌తో ఈవెంట్‌కి వచ్చింది. ఇందులో ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్‌లా ఉంటుందని చెప్పింది.

New Update
Deepika Padukone : ప్రభాస్ వల్లే ఇలా మారిపోయా.. బేబీ బంప్ పై దీపికా పదుకొనే కామెంట్స్!

Deepika Padukone Funny Comments About Prabhas : టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి' జూన్ 27 న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమాని భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం ముంబై లో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్‌తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ లతో పాటూ దగ్గుబాటి రానా సైతం పాల్గొన్నాడు. ఇక ఈ ఈవెంట్ లో దీపికా పదుకొనే ప్రభాస్ పై చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ వల్లే ఇలా...

దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబి బంప్‌తోనే ముంబైలో జరిగిన ఈవెంట్‌కి వచ్చింది. అయితే ప్రభాస్ ఫుడ్ వల్లే తనకు ఇది (బంప్) వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్‌లా ఉంటుందని చెప్పింది.

Also Read : కల్కి కథేంటో తెలిసిపోయింది..గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్

" నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్. అతడి ఇంటి భోజనమే నా బేబి బంప్‪‌కి కారణం (సరదాగా నవ్వుతూ). ప్రతిరోజు షూటింగ్‌కి ప్రభాస్ ఇంటి నుంచి భోజనం వచ్చేది. ఎంతో ఇష్టంగా మూవీ టీమ్‌ కోసం భోజనం తెప్పించేవాడు. అది భోజనంలా కాకుండా క్యాటరింగ్‌లా ఉండేది. అలానే ప్రభాస్ ఇంటి నుంచి ఎలాంటి స్పెషల్ ఫుడ్ వస్తుందా అని ప్రతిరోజు ఎగ్జైట్‌మెంట్‌గా ఉండేది" అంటూ చెప్పుకొచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు