Deepika and Ranveer Wedding Video Viral: బాలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్న జంటల్లో దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) జంట ఒకటి. ఐదేళ్ల క్రితం 2018లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటని అభిమానులు ప్రేమగా ‘దీప్‌వీర్’(DeepVeer) అని పిలుచుకుంటూ ఉంటారు. వీరి పెళ్లి జరిగి ఐదేళ్లయినా.. వివాహానికి సంబంధించిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. తాజాగా బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ (Karan Johar) తన షో 'కాఫీ విత్ కరణ్'లో ఒక వీడియోను విడుదల చేశారు.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్ స్టార్ మల్టీస్టారర్.. రజినీకాంత్ ఎమోషనల్ ట్వీట్
బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకోణ్-రణ్‌వీర్ సింగ్‌లు కలిసి కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌కు పండగే. అలాంటిది ఇద్దరూ కలిసి 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) షో ప్రోగ్రామ్‌లో పాల్గొనడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’లో ఈ పవర్ కపుల్ పాల్గొని.. తమ పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.పెళ్లి వీడియోను చూసి షో హోస్టు కరణ్ జోహార్ కంటతడి పెట్టారు. చాలా ఎమోషనల్‌గా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీప్‌వీర్ జంటను చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ ఇద్దరినీ హగ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
2013లో విడుదలైన ‘రామ్ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్ తొలిసారి కలిసి పని చేశారు. రామ్ లీలా చిత్రంలో జోడీ కట్టిన ఈ ప్రేమజంట సుదీర్ఘ ప్రయాణం అనంతరం 2018 నవంబర్ 14 పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే రామ్ లీలా రిలీజైన తేదీ.. వీరి పెళ్లి నవంబర్ 14 కావడం విశేషం. దీపిక, రణ్‌వీర్ కలిసి రామ్‌లీలా - బాజీరావ్ మస్తానీ - పద్మావత్ వంటి బాక్స్ ఆఫీస్ చిత్రాల్లో నటించారు. పెళ్లయిన 5 సంవత్సరాల తర్వాత వీరి పెళ్లి వీడియో బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాప్యీగా ఫీల్ అవుతున్నారు. 'కాఫీ విత్ కరణ్' షోలో తాజాగా దీపిక, రణవీర్ పలు విషయాలను పంచుకుని సందడి చేశారు.