Decrease in Devotees Walking to Tirumala Hill: నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే తిరుమల అలిపిరి మెట్ల మార్గం బోసిపొయింది. 'గోవిందా గోవిందా' నామస్మరణతో నిత్యం భక్తి పరవళ్ళు తొక్కే మెట్ల మార్గం ఇప్పుడు మూగపోయింది. ఎక్కడో ఒక చోటా భక్తులు కనిపించడం తప్ప.. మునుపటిలా తాకిడి లేదు. మెట్లపై కర్పూరాలు కూడా అక్కడక్కడే దర్శనమిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం 6ఏళ్ల లక్షితను చిరుత చంపిన తర్వాత నుంచి పరిస్థితులు రోజురోజుకు మారుతూ వస్తున్నాయి. భయంతో భక్తులు కాలినడక మార్గాన రావడం లేదు. రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉన్నా..
శ్రీవారి భక్తులు కనిపించడంలేదు.
భయపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులు:
ఏడుకొండలు ఎక్కి వచ్చే భక్తులకు ఎలాంటి కోరికనైనా దేవుడు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ మొక్కునే ఎక్కువగా భక్తులు కోరుకుంటారు. మెట్ల మార్గాన నడిచి వస్తామని దేవుడికి చెప్పుకుంటారు. కోరికలు తీరిన తర్వాత కూడా మెట్ల మార్గాన కర్పూరం వెలిగించుకుంటూ దేవుడిని దర్శించుకుంటారు. మెట్లకు పసుపు కుంకుమ కూడా పెడతారు. అటు లక్షితపై దాడి తర్వాత చిరుతలను పట్టుకునే ప్రయత్నం టీటీడీ చేస్తోంది. ఇప్పటికే మూడు చిరుతలను బంధించింది కూడా.
ఆపరేషన్ కంటీన్యూ:
ఈ క్రమంలోనే టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీలకు కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకే మెట్ల మార్గాన అనుమతినిచ్చింది. ఆ తర్వాత తిరుమల కాలినడక మార్గంలో వారికి అనుమతి నిషేధం. దీని కారణంగానే తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. ఇప్పటికే మూడు చిరుతలను పట్టుకున్న టీటీడీ.. ఆపరేషన్ చీతాను కొనసాగిస్తామని చెబుతోంది. చిరుతలను పట్టుకునేందుకు మహారాష్ట్ర నుంచి బోనులు తీసుకొచ్చింది. ఎన్ని చిరుతలు ఉన్నాయి.. వాటి లెక్క ఎంత అని తేల్చేందుకు కెమెరాలను ఏర్పాటు చేసింది. నరసింహస్వామి ఆలయం వద్దనే చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందని టీటీడీ భావిస్తోంది. కెమెరాల్లో కూడా ఇదే రికార్డు అయింది. లక్షిత కూడా అక్కడే మరణించింది. అందుకే మిగిలిన చిరుతలను కూడా పట్టుకొని వాటిని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. సురక్షితమైన వాతావరణం తీసుకురావడం కోసం ఆపరేషన్ చీతా కంటిన్యూ అవుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది.
చిరుతపులి భయం ఎఫెక్ట్.. బోసిపోయిన అలిపిరి కాలినడక మార్గం!
తిరుమల అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. చిరుతపులి ఎఫెక్ట్‌తో భక్తులు కాలినడకన వచ్చేందుకు భయపడుతున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం 6ఏళ్ల లక్షితను చిరుత చంపేసిన తర్వాత భక్తుల ఆలోచనా తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతపులులను టీటీడీ పట్టుకుంది. మిగిలిన వాటిని కూడా పట్టుకోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు మహారాష్ట్ర నుంచి బోనులను తీసుకొచ్చింది.
New Update
Advertisment