ఆంధ్రప్రదేశ్ చిరుతపులి భయం ఎఫెక్ట్.. బోసిపోయిన అలిపిరి కాలినడక మార్గం! తిరుమల అలిపిరి మెట్ల మార్గం బోసిపోయింది. చిరుతపులి ఎఫెక్ట్‌తో భక్తులు కాలినడకన వచ్చేందుకు భయపడుతున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం 6ఏళ్ల లక్షితను చిరుత చంపేసిన తర్వాత భక్తుల ఆలోచనా తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతపులులను టీటీడీ పట్టుకుంది. మిగిలిన వాటిని కూడా పట్టుకోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు మహారాష్ట్ర నుంచి బోనులను తీసుకొచ్చింది. By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మరో చిరుత హల్చల్.. భక్తులు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు తిరుమల నడకదారిలో మరో చిరుత కలకలం రేపింది. ఓ బాలుడు చిరుతను చూశాను అని చెప్పడంతో.. భక్తులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై, అక్కడి నుంచి పరుగులు పెట్టారు. మళ్లీ చిరుత ఎవరిపై దాడి చేస్తుందోమోనని భయంతో అరుపులు, కేకలు పెట్టారు భక్తులు. నామాలగవి దగ్గర చిరుత కనిపించిందని పులి కనిపించిందని ఆ బాలుడు చెబుతున్నాడు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. వెంటనే బాలుడు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. బోను చిక్కింది పెద్ద పులి అయి ఉంటుందని, ఇవి దాని పిల్లలు అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భక్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn