BREAKING : రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ! కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై బాంబుదాడి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్‌లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది. By Trinath 02 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Death Threat to Rahul Gandhi : కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని వార్త టెన్షన్ పెడుతోంది. రాహుల్ గాంధీపై ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) పై బాంబు దాడి జరిగినట్టే జరగొచ్చని మహారాష్ట్ర(Maharashtra) లోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ రాహుల్ నివాసానికి భద్రతను పెంచింది. అలాగే రాహుల్ గాంధీకి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఢిల్లీ పోలీసులు, యూపీ, మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీకి జెడ్ ప్లస్ భద్రత ఉంది. ఆయన న్యాయ్ జోడో యాత్ర ఇవాళ(మార్చి 2) మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్‌లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్లు ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన నివాసం దగ్గర పెట్రోలింగ్‌ను పెంచారు. సాధారణ దుస్తుల్లో పోలీసులను మోహరించారు. #WATCH दिल्ली: कांग्रेस नेता राहुल गांधी दिल्ली हवाई अड्डे पर पहुंचे। pic.twitter.com/E3FxTdrEDa — ANI_HindiNews (@AHindinews) March 1, 2024 రాకపోకలను తనిఖీ చేయాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులు, ఢిల్లీ పోలీసు(Delhi Police) లను హోం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు స్పెషల్ సెల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాహుల్ గాంధీపై దాడికి సంబంధించి వచ్చిన ఇన్‌పుట్‌లు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఇరు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. విచారణ కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి ఉన్న జెడ్ ప్లస్ భద్రతలో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జి కమాండోలు ఉన్నారు. పోలీసు సిబ్బందితో సహా 55 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. ఈ కమాండోలందరూ 24 గంటలూ రాహుల్‌కు రక్షణగా ఉంటారు. ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణుడు కూడా. గతంలోనూ ఇంతే: అయితే రాహుల్ గాంధీకి డెత్ థ్రేట్ అంటూ పోలీసులకు సమాచారం రావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ తరహా సమాచారం పోలీసులకు అందింది. గతేడాది(2023)మార్చిలోనూ ఇలాంటి బెదిరింపే వచ్చింది. రాహుల్ గాంధీతో పాటు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కన్వీనర్ లాలన్ కుమార్‌ను చంపుతామని గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి బెదిరించాడు. గతేడాది మార్చి 25న లలన్‌కుమార్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. Also Read : క్రికెటర్లపై బీజేపీ కన్ను.. యువరాజ్ సింగ్ ట్వీట్ వైరల్! #maharashtra #congress #rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి