విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై డీసీపీ షాకింగ్ కామెంట్స్.!

విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతుందన్నారు డీసీపీ 2 ఆనంద్ కుమార్ రెడ్డి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. అందులో యూట్యూబర్ నాని కూడా ఉన్నాడన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వ్యాఖ్యనించారు.

New Update
విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై డీసీపీ షాకింగ్ కామెంట్స్.!

Visakha Harbor Incident: విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అంత పెద్ద ప్రమాదం ఎలా జరిగింది? ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా? లేదంటే యాక్సిడెంటల్ గా జరిగిందా? అనే యాంగిల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం అర్థరాత్రి పార్టీ జరిగే సమయంలో బోట్ల కొనుగోలు, అమ్మకాల విషయంలో వివాదం చెలరేగి మంటలకు కారణమై ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి యూ ట్యూబర్‌ నాని, అతని స్నేహితుల పనై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై డీసీపీ 2 ఆనంద్ కుమార్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు.

Also Read: బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.!

విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. అందులో యూ ట్యూబర్ కూడా అనుమానితుడు గా ఉన్నాడని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై టెక్నీకల్ అవిడెన్స్ కూడా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. విచారణ తేలిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వ్యాఖ్యనించారు.

Also read: విశాఖ షిప్పింగ్ హార్బర్‌ బాధితులకు అండగా జనసేనాని.!

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 40 ఫిషింగ్ బోట్లు కాలి బూడిదయ్యాయి. మత్స్యకారులకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయితే, ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై స్పందించిన వైసీపీ ప్రభుత్వం బాధితులకు 80 శాతం నష్ట పరిహరం చెల్లిస్తోంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారికి అండగా నిలుస్తున్నారు. అంతేకాకుండా, టీడీపీ ముఖ్యనేతలు సైతం సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు