Dawood Ibrahim: ముస్లింల కోసం దావూద్ చాలా చేశాడు..అండర్ వరల్డ్ డాన్‌పై స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముస్లిం కోసం దావూద్ చాలా చేశాడంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ ఇబ్రహీం గురించి ఈ వ్యాఖ్యలు చేశాడు.

New Update
Dawood Ibrahim:  ముస్లింల కోసం దావూద్ చాలా చేశాడు..అండర్ వరల్డ్ డాన్‌పై స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dawood Ibrahim:  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈసారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దావూద్ ఇబ్రహీం "ముస్లింల కోసం చాలా చేసాడు" అని అంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. పాకిస్థానీ జర్నలిస్ట్ హసన్ నిసార్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మియాందాద్ మాట్లాడుతూ, ఇబ్రహీంతో తన దీర్ఘకాల పరిచయాన్ని, ముఖ్యంగా అతను నివసించే దుబాయ్‌ గురించి  హైలైట్ చేశాడు.

మియాందాద్ తన కుమారుడు ఇబ్రహీం కుమార్తె మహర్ఖ్‌ను వివాహం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నాడు. ఆమె కాన్వెంట్ విశ్వవిద్యాలయ సెట్టింగులలో చదువుకున్న నేపథ్యాన్ని గురించి నొక్కి చెప్పాడు.మియాందాద్ ముస్లిం సమాజానికి ఇబ్రహీం చేసిన సేవలను కొనియాడాడు. దావూద్ ముస్లింలకు చేసిన సేవలు చాలాకాలం గుర్తుంచుకోవాలని పేర్కొన్నాడు.

మియాందాద్ కుమారుడు జునైద్, ఇబ్రహీం కుమార్తె మహర్ఖ్‌ల వివాహం 2005లో దుబాయ్‌లో గట్టి భద్రతా చర్యలలో జరిగింది. అయితే దావూద్ ఇబ్రహీం భారతదేశంలో వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో 1993లో జరిగిన వరుస పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దావూద్ విధ్వంసకర చర్యల్లో దాదాపు 260 మంది ప్రాణాలు కోల్పోయారు.

దావూద్ భారత్ లో క్రిమినల్ సిండికేట్ అయిన D-కంపెనీకి నాయకత్వం వహిస్తున్నాడు. వ్యవస్థీకృత నేరాలతో సహా వివిధ నేరాలకు సంబంధించి ఇంటర్‌పోల్ వాంటెడ్ క్రిమినల్‌గా జాబితాలో ఉన్నాడు. తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా పాకిస్తాన్‌లోని కరాచీలో ఆసుపత్రిలో చేరినట్లు...ఇబ్రహీం గురించి గత డిసెంబర్‌లో సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే దావూద్ కు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఇబ్రహీం పట్ల మియాందాద్ చేసిన ప్రశంసలు విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ఇబ్రహీం నేర, తీవ్రవాద చర్యలలో ప్రమేయం ఉన్న వ్యక్తి గురించి మియాందాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి:  సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కేసీఆర్ బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు