/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-17T141602.132-jpg.webp)
David Beckham: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హమ్ కు అంబానీ ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ప్రస్తుతం భారత సందర్శనలో ఉన్న ఆయనను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక మర్యాదలు చేశారు. అలాగే ముంబై ఇండియన్స్ జెర్సీనీ డేవిడ్ కు అందించారు. ఇందుకు సంబంధించి పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Maharashtra | British Soccer Star David Beckham at Antilia with Reliance Industries chairperson Mukesh Ambani, Nita Ambani and family. pic.twitter.com/uvC8ZDkjAA
— ANI (@ANI) November 16, 2023
Also read :Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే
బిజినెస్ పనుల్లో భాగంగా ఇండియా టూర్ కు వచ్చిన డేవిడ్ బెక్‌హమ్ భారతీయులను అలరిస్తున్నారు. ఇటీవలే ఇండియా, న్యూజీలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన ఆయన.. స్టేడియంలో తెగ సందడి చేశారు. 50 సెంచరీలు చేసిన కోహ్లీని (Kohli) అభినందించడంతో పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ పై ప్రశంసలు కురిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇతర ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించారు. వారితో చాలా సమయాన్ని గడిపారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబ సభ్యులు డేవిడ్ ను తమ ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. ముంబైలోని అంబానీ నివాసం యాంటిలియాకు వెళ్లిన బెక్‌హమ్‌కు (David Beckham).. ముకేశ్ అంబానీ, భార్య నీతా అంబానీ, కూతురు ఇషా అంబానీ, కుమారుడు ఆకాశ్‌తోపాటు శ్లోకా మెహతా, అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ సాదర స్వాగతం పలికారు. ఇదిలావుంటే.. యునిసెఫ్ అంబాసిడర్‌గా ఉన్న అతను తొలిసారి ఇండియాకు రాగా.. ఇక్కడి కల్చర్, నేచర్ అద్భుతంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం అంబానీ ఇంట్లో బెక్ హమ్ ఫొటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.