అత్తపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!

పంజాబ్ కు చెందిన ఓ మహిళా తన 61 ఏళ్ల అత్త, మరిదిపై అత్యాచారం కేసు పెట్టింది. పెద్ద కొడుకును వర్చ్ వల్ గా పెళ్లిచేసుకోగా అతను అమెరికాలోనే ఉంటున్నాడు. దీంతో మరిది లైంగిక దాడికి పాల్పడ్డాడని, దీనికి అత్త సహకరించిందని ఫిర్యాదు చేయగా ఈ కేసు సుప్రీంకోర్టుకు ఎక్కింది.

అత్తపై అత్యాచారం కేసు పెట్టిన కోడలు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే!
New Update

అత్తపై ఓ కోడలు అత్యాచారం కేసు పెట్టిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విదేశాల్లో ఉంటున్న యువకుడిని వర్చువల్ గా పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్త లేకముందు తన మరిది, అత్తా తనను లైంగికంగా హింసించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం అత్త కింది కోర్టులను ఆశ్రయించగా ఆమె పిటిషన్‌ను న్యాయస్థానాలు కొట్టేశాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేసింది.

ఇక పూర్తి వివారాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన మహిళ (61) గతేడాది సెప్టెంబరులో తన పెద్ద కుమారుడికి ఓ యువతితో పెళ్లి చేసింది. కుమారుడు అమెరికాలో ఉండగా.. వర్చువల్‌గానే ఈ పెళ్లిని జరిపించారు. ఆ తర్వాత నుంచి అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే పెళ్లి తర్వాత ఆమె పెద్ద కొడుకు ఇంటికి రాలేదు. కొన్నాళ్ల తర్వాత సదరు మహిళ చిన్న కుమారుడు పోర్చుగల్‌ నుంచి వచ్చి, కొన్ని రోజులు కుటుంబంతో ఉండి ఈ ఏడాది జనవరిలో తిరిగి వెళ్లిపోయాడు. అయితే అతడు వెళ్లిపోయిన కొన్నాళ్లకు.. తన అత్త, ఆమె చిన్న కుమారుడిపై కోడలు అత్యాచార కేసు పెట్టింది. నగ్న ఫొటోలు చూపించి అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ తన అత్త బెదిరించిందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు ఆ మహిళతోపాటు ఆమె చిన్న కుమారుడిపై కేసు నమోదు చేశారు.

Also read :Fake Currency: నకిలీ కరెన్సీ చలామణీకి యత్నం.. గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ

ఈ క్రమంలో ముందస్తు బెయిలు కోసం అత్త స్థానిక కోర్టులను ఆశ్రయించగా ఆమె పిటిషన్‌ను న్యాయస్థానాలు తిరస్కరించాయి. దీంతో ఆమె సుప్రీంకోర్టులో పిటిషను దాఖలు చేయగా.. ఇలాంటి కేసుల్లో మహిళలపై అభియోగాలు నమోదు చేయవచ్చా? అనే అంశం పరిశీలనకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అత్యాచార కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 61 ఏళ్ల మహిళ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై తన స్పందన తెలియజేయాలంటూ పంజాబ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ‘మహిళపై అత్యాచారం కేసు నమోదు చేయొచ్చా?.. లేదా?’ అనే అంశాన్ని తాము పరిశీలిస్తామని జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ల ధర్మాసనం వెల్లడించింది. అప్పటివరకు పిటిషన్‌దారుకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తున్నామని, దర్యాప్తునకు ఆమె సహకరించాలని ఆదేశించింది.

#daughter-in-law #mother-in-law #filed-rape-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe