AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో!

బర్రెలక్క స్ఫూర్తితో మరో యువతి రాజకీయ బరిలోకి దిగబోతుంది. ఆంధప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ ‘జుమ్ చక జుమ్ చక’ అనే యూట్యూబ్ స్టార్.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కేతిరెడ్డిని ఓడిస్తానంటోంది.

AP Barrelakka: ఏపీలో మరో బర్రెలక్క.. ఏకంగా ఎమ్మెల్యే కేతిరెడ్డిపైనే పోటీకి సై.. వైరల్ వీడియో!
New Update

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) ఒక సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగుల గొంతుకగా కొల్లాపూర్ నియోజక వర్గంనుంచి బరిలోకి దిగిన శిరీషకు పెద్ద ఎత్తున్న ఆదరణ లభించింది. అయితే ఆమె స్ఫూర్తితోనే మరో యువతి ముందుకొచ్చింది. ఆంధప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన దాసరి కవిత అలియాస్ ‘జుమ్ చక జుమ్ చక’ అనే యూట్యూబ్ స్టార్.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపింది. అంతేకాదు తమ నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే తనను గెలిపించాలని, ఇందుకు సంబంధించిన మేనిఫెస్టో వీడియో రిలీజ్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

ఈ మేరకు కొంతకాలంగా యూట్యూబ్ ఛానెల్ లో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన దాసరి కవిత.. 2024 ఎలక్షన్స్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని చెప్పింది. తమ నియోజక వర్గాన్ని చాలా సమస్యలు వెంటాడుతున్నాయని, ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయని తెలిపింది. ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించినా ఎవరూ తమ ప్రజలను ఈ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కించలేకపోయారని, అందుకే తానే స్వయంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ధర్మవరంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని పేర్కొంది.

Also read :దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఫ్యామిలీని కబళించిన మృత్యువు

ధర్మవరం నియోజక వర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారని, వాళ్లకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పింది. దానికోసం ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్ కావాల్సిన అవసరముందని తెలిపింది. అలాగే పోటీ ప్రపంచంలో నిలబడాలంగే కంపూటర్ శిక్షణ అవసరమని పేర్కొన్న కవిత.. తనను గెలిపిస్తే ప్రతి మండలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ సెంటర్ లు నిర్వహిస్తానంది. తమ నియోజక వర్గంలో యాబైవేల మందికి పైగా ఇక చేనేత కార్మికులు వలస వెళ్లిపోయారని, వారందరికీ ఉపాధి కల్పించడం కోసం హ్యాండ్లూమ్ మగ్గాలను ఏర్పాటు చేయిస్తానని చెప్పింది. ఆధిక ఫీజులు, మంచినీటి సమస్యలను తీరుస్తానని తెలిపింది. చివరగా ఇప్పటికైనా యువతరం మేల్కోవాలి. పెద్ద ఎత్తున యువతరం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరముంది. మనమంతా కలిసి మంచి నాయకులను ఎన్ను్కోవాలి. సమాజానికి మంచి చేసే వాళ్లకు సపోర్టు ఇస్తారని ఆశిస్తున్నా. లేదంటే సమాజం మరింత తప్పదారి పట్టే అవకాశం ఉందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కవిత మేనిఫెస్టో :
1. నిరుద్యోగులకోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు.
2. ప్రతి మండలంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ.
3. చేనేత కార్మికులకు ఉపాధి.
4. ట్రాన్స్ జెండర్లకు ఆధార్, రేషన్ కార్డులు.
5. అధిక స్కూల్ ఫీజులమీద చర్యలు.
6. అర్హులైన వాళ్లందరికీ పించన్
7. ప్రతి పల్లెకు రోడ్డు నిర్మాణం.
8. త్రాగునీటి సమస్యకు పరిష్కారం.

#ap #dharmavaram #dasari-kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe