Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్.. బస్సుకింద పడుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే!

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిపై ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే స్టంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లి దానికింద పడుకున్నాడు. వీడియో వైరల్ అవుతుండగా ఇది గ్రాఫిక్స్ అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు.

New Update
Viral Video: రీల్స్ కోసం డేంజర్ స్టంట్.. బస్సుకింద పడుకున్న యువకుడు.. చివరికి ఏమైందంటే!

Hyderabad: సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందాలనే పిచ్చితో పిల్లలనుంచి వృద్ధుల వరకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మరికొందరు హద్దులు దాటి ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

ఈ మేరకు రీల్ కోసం ఓ యువకుడు డేంజర్ స్టంట్ చేశాడు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురెళ్లిన యువకుడు.. క్షణాల్లో బస్సు ముందు పడుకోవడంతో బస్సు అతనిపైనుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వెంటనే లేచి అతను పక్కకు వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రీల్స్ పిచ్చితో ప్రాణాలను లెక్కచేయకుండా ఇలాంటి స్టంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా గ్రాఫిక్స్ అని కొట్టిపారేస్తున్నారు. అతని నీడ, బస్సు వెళ్లిన తీరు, బస్సు వెనకాల వచ్చిన ఆటో, స్కూటీలను గమనిస్తే ఇది పూర్తిగా ఫేక్ అని అర్థమైపోయిందంటూ వివరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు