Damodaram Sanjeevaiah : ఏపీ తొలి దళిత ముఖ్యమంత్రి.. దేశంలోనే అత్యంత నిరుపేద సీఎం!

ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి, దేశంలోనే అత్యంత నిరుపేద సీఎంగా దామోదరం సంజీవయ్య చరిత్రలో నిలిచిపోయారు. ప్రజాప్రతినిధిగా వచ్చిన జీతం తప్ప మరో ఆదాయం లేదు. ఆయన మరణించే వరకు బట్టలు, ఒక ప్లేటు, గ్లాసు మాత్రమే.. ఆసక్తికరమైన స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Damodaram Sanjeevaiah : ఏపీ తొలి దళిత ముఖ్యమంత్రి.. దేశంలోనే అత్యంత నిరుపేద సీఎం!

Kurnool : అది 1960 జనవరి.. ప్రాంతం కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామం.. ఢిల్లీ (Delhi) నుంచి వచ్చిన హస్తం పార్టీ పెద్దలతో కలిసి నాటి ఏపీ కాంగ్రెస్‌ (Congress) యువనాయకుడిగా ఉన్న చక్రపాణి ఓ ఇంటికి వెళ్లారు. గ్రామ పొలిమేరలలో ఉన్న పూరి పాక అది. ఆ పాక బయట ఒక ముసలవ్వ కట్టెల పొయ్యిపై మట్టి కుండతో అన్నం వండుతోంది. పొగ గొట్టంతో మంటను ఊదుతూ చెమటలు కక్కుతోంది. చక్రపాణి (Chakrapani) నడుస్తూ ఆ అవ్వ దగ్గరకు వెళ్తుంటే పక్కనే ఉన్న ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరిదో కాదు కాబోయే ముఖ్యమంత్రి సంజీవయ్య (Sanjeevaiah) దని వారికి అప్పటికే అర్థమైంది. దేశానికి తొలి దళిత సీఎంని ఇచ్చిన రాష్ట్రంగా ఏపీ పేరు సంపాదించుకున్న రోజులవి..!

ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి..
పెద్దపాడులోని ఓ దళిత కుటుంబంలో ఫిబ్రవరి 14, 1921న దామోదరం సంజీవయ్య జన్మించారు. జనవరి 10, 1960లో సంజీవయ్య ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరో దళిత సీఎం ఏపీకి సేవలందించలేదు. ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఆఖరికి వార్డ్‌ మెంబర్లు సైతం కోట్లకు పడగలేత్తిన ఇండియాలో దామోదరం సంజీవయ్య మాత్రం చివరి వరకు పేదరికంలోనే బతికారు. ప్రజాప్రతినిధిగా ఆయనకు వచ్చిన జీతం తప్ప మరో ఆదాయం లేదు. భారత్‌లో 18వ లోక్‌సభకు మంత్రివర్గం కొలువు దీరిన వేళ అంతా రిచెస్ట్‌ ఎంపీల గురించి, ధనిక మంత్రుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే సయయంలో ఓ వర్గానికి మాత్రం కడ వరకు పేదవాడిగా మిగిలిపోయిన దామోదరం సంజీవయ్యే గుర్తుకు వస్తున్నారు!

అగ్రకుల నేతలు భరించలేక..
సంజీవయ్యను ముఖ్యమంత్రి చేయాలన్నది నాటి ప్రధాని నెహ్రూ నిర్ణయం. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌లోని అగ్రకుల నేతలు భరించలేకపోయారు. సంజీవయ్యకు వ్యతిరేకంగా నెహ్రూకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. అయితే ఈ కంప్లైంట్లను నెహ్రూ నమ్మలేదు కానీ ఆయనపై ఒత్తిడి పెరిగిపోయింది. సంజీవయ్యపై అవినీతి ఆరోపణలను రహస్యంగా విచారణ జరపాలని ఢిల్లీ నుంచి ఓ టీమ్‌ను కర్నూలుకు పంపారు నెహ్రూ. ఈ నిర్ణయం చక్రపాణికి షాక్‌కు గురి చేసింది. అయినా ప్రధాని ఆదేశాలు కావడంతో చివరకు ఢిల్లీ పెద్దలను తీసుకోని సంజీవయ్య ఇంటికి వెళ్లగా.. అక్కడున్న పరిస్థితులు చూసి హస్తం నేతలు కంగుతిన్నారు. ఏ మాత్రం ఆస్తిపాస్తులు లేని సంజీవయ్యపై అగ్రకులాలు ఇన్ని ఆరోపణలు చేశాయా అని తమ తప్పును తెలుసుకున్నారు!

బట్టలు, భోజనం చేసేందుకు ఒక ప్లేటు..
1972లో సంజీవయ్య మరణించే వరకు ఆయనకున్న ఆస్తి ఏంటో తెలుసా? కేవలం బట్టలు, భోజనం చేసేందుకు ఒక ప్లేటు, గ్లాసు మాత్రమే. నెహ్రూ, లాల్‌ బహద్దూర్‌ శాస్త్రి మంత్రి వర్గాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిసిన సంజీవయ్య కార్మికలోకం కోసం ఎంతో కృషి చేశారు. పార్లమెంట్‌లో బోనస్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి దేశ వ్యాప్తంగా ఉన్న కార్మికుల ప్రయోజనాలు రక్షించారు. ఇక ఈఎస్‌ఐ చట్టంలో కుటుంబం అనే పదాన్ని చేర్చారు. అంతేకాదు మహిళా కార్మికుల తల్లిదండ్రులను కూడా పరిధిలో చేర్పించారు సంజీవయ్య.

ప్రజాశ్రేయస్సు కోసమే పని చేసి..
బతికి ఉన్నంత కాలం ప్రజాశ్రేయస్సు కోసమే పని చేసిన సంజీవయ్య లాంటి నేతలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తనకున్న యావత్‌ ఆస్తిను వదిలి ఓ సామాన్యుడిలా బతికారు. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేసిన ఘనత టంగుటూరిది. అంతటి మహనీయుడు తన చివరి దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించారు. తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరులతో అన్నారంటే ఆయన పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవచ్చు. ఇలా టంగుటూరి, సంజీవయ్య లాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారు.. అందరిలో ఒకరిగా కనిపిస్తారు..!

Also Read : పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి!

Advertisment
Advertisment
తాజా కథనాలు