Life Style Habits : ఆరోగ్యం కోసం చాలా మంది చేయని ప్రయత్నాలు ఉండవు. గంటలపాటు వ్యాయామం చేసే సదుపాయం లేక, జిమ్‌కి వెళ్లే సమయం లేక అయోమయానికి గురవుతూ ఉంటారు. అలాంటి వారికి ఇంటి దగ్గరే అధిక బరువు తగ్గించడంలో సూర్యనమస్కారాలు బాగా పనిచేస్తాయి. జీవనశైలి(Life Style), ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పుల కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. 30 ఏళ్లు దాటక ముందే ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. కొద్దిగా దూరం నడిచినా, గంట నిలుచుకున్నా.. ఆకరికి ఓ పదినిమిషాలు కింద కూర్చున్నా తట్టుకోలేకపోతున్నారు. కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చొని జంక్‌ఫుడ్ బాగా తిని వంగిపోయినట్టుగా ఫిక్స్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆడవారిలో 30 ఏళ్లు దాటిన వారికి ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లలను కన్న తర్వాత మరీ వీక్ అయిపోతున్నారు. ఇలాంటి వారు ఇంటి దగ్గరే సులభంగా చేసుకునే కొన్ని యోగాసనాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్య నమస్కారాలతో బరువు తగ్గడంతో పాటు ఎన్నో రోగాలు దూరం అవుతాయి. మానసిక ఒత్తిడి దూరం కావడంతో పాటు ప్రశాంతంగా ఉంటారు.
సూర్యనమస్కారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి, వెన్నెముక, కీళ్లు, కాళ్ల నొప్పులు అస్సలు ఉండవు. అలాగే మన బాడీకి కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. పనిలో ఏర్పడిన ఒత్తిడిని కూడా ఇవి తగ్గిస్తాయి. యాంగ్సైటి సమస్య ఉంటే సూర్య నమస్కారాలు చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిద్రలేమిని తగ్గించడంతో పాటు మన కంటి చూపును బాగా మెరుగుపరచడంలో సూర్య నమస్కారాలు ఉపయోగపడతాయి. సూర్య నమస్కారాలు ఒక రోజులో 12 సెట్లు చేస్తే బరువు తగ్గడంతో పాటు కండరాల బలం బాగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: చేతులు నల్లగా మారుతున్నాయా? ఈ హ్యాండ్ కేర్ టిప్స్ పాటించండి!
అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ(Blood Pressure) కూడా బాగా పెరిగి గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. లాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్తి, మలబద్ధకం ఉండవు. ఈ ఆసనాలు చేయడం ద్వారా ఊపిరితిత్తులు బాగా బలంగా మారుతాయి. కాకపోతే సూర్య నమస్కారాలు ఒకేసారి 12 సెట్లు చేయడం బాగా కష్టం. ఒకటిగా మొదలుపెట్టి మీ సామర్థ్యాన్ని బట్టి పెంచుతూ పోవాలని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజు సూర్యనమస్కారాలను మీ పనిలో భాగంగా చేసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.